AP TDP: ‘టీడీపీ ఫర్ ఆంధ్ర వెబ్‌సైట్’ ను ప్రారంభించిన చంద్రబాబు, విరాళాల కోసం ప్రజలకు విజ్ణప్తి

  • Written By:
  • Updated On - April 10, 2024 / 12:14 AM IST

AP TDP: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టగా, టీడీపీ ప్రజాగళం పేరుతో వరుసగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం దూసుకుపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పార్టీకి విరాళలందించేందుకు గాను tdpforandhra.com సైట్ ను మంగళవారం ఆవిష్కరించారు.

విరాళాల కోసం ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు తన వంతుగా రూ.99,999లు ఆన్ లైన్ ద్వారా చెల్లించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ. ‘‘రాష్ట్రాన్ని జగన్ రివర్స్ గేర్ లో నడిపిస్తున్నారని అన్నారు. టీడీపీ చరిత్ర కలిగిన పార్టీ అని, 42 ఏళ్లు అనుభవం ఉందన్నారు. రాజకీయాల్లోకి ధనవంతులు, భూస్వాములు కాకుండా..విద్యావంతులు రావాలి..నీతివంతులతో సామాజిక న్యాయం కోసం టీడీపీ ముందుకు వెళ్లిందన్నారు. చదువుకున్న వారిని ఎమ్మెల్యే, ఎంపీలుగా చేశాం’’ అని అన్నారాయన.

‘‘పార్టీకి 2 ఏళ్లకు ఒకసారి సభ్యత్వం ద్వారా వచ్చిన డబ్బులను కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. వైసీపీలాగా అక్రమ సొమ్ముతీసుకోవడం లేదు. రూ.160 కోట్లకు వైసీపీ జూదగాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని విలువల గురించి మాట్లాడుతోంది. ఆన్ లైన్ జూదాన్ని అధికారికంగా ఒప్పుకున్నారు. అలాంటి నీచనమైన పనులు చేయడం దుర్మార్గం. మేము తెలుగు ప్రజలపైనే ఆధారపడుతున్నాం. అందరూ ముందుకు వచ్చి తోచిన విధంగా పార్టీకి సాయం అందించాలి’’ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

కాగా చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘వలంటీర్లూ.. తన రాజకీయ స్వార్థం కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్న వైఎస్ జగన్ మాయ మాటలను నమ్మకండి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక వలంటీర్లుగా మిమ్మల్నే కొనసాగించడమే కాదు.. మీ గౌరవ వేతనాన్ని రూ. 10 వేలు చేస్తాం’ అని ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ప్రధాన పార్టీకి వ్యూహాలకు చెక్ పెడుతున్నారు.