తెలుగుదేశం పార్టీ రెండేళ్లకు ఒకసారి చేపట్టే సభ్యత్వ నమోదు కార్యక్రమము ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సభ్యత్వ నమోదును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఈసారి వినూత్నంగా వాట్సాప్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం విశేషం. ఇప్పటికే పార్టీలో సభ్యులుగా ఉన్నవారు సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలన్నా, కొత్తగా సభ్యత్వం తీసుకోవాలన్నా, మీ ద్వారా మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను పార్టీలో చేర్చాలన్నా అన్నీ వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. దీనికోసం ఫోన్‌లో 9858175175 నెంబరును సేవ్ చేసుకుని వాట్సాప్ నుంచి ఈ నంబరుకు హాయ్ అని సందేశం పంపించడం ద్వారా నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల ప్రమాద బీమా అందిస్తారు. కుటుంబ ఆర్థిక కారణాల దృష్ట్యా కార్యకర్తల పిల్లల చదువులు ఆగిపోయినా.. కార్యకర్త తీవ్ర అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో చికిత్స తీసుకోలేని స్థితిలో ఉన్నా.. అటువంటి వారికి పార్టీ అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తుంది. వివాహాలకు, జీవనోపాధికి, పింఛన్లకు, సహజ మరణాల సందర్భంలోనూ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా నిలవనుంది.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తోన్న టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. #TDPMembershipDrive2022 https://t.co/EsVbs4x6WC
— Telugu Desam Party (@JaiTDP) April 21, 2022