భారీ వర్షాలు (Heavy Rains) ఏపీని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బుడమేరు వరదకు విజయవాడ (Vijayawada) నగరం నీటమునిగింది. ప్రస్తుతం వరద తగ్గడం తో ప్రభుత్వం సహాయక చర్యలు స్పీడ్ చేసింది. అలాగే ఇల్లు వదిలి వెళ్లిన బాధితులంతా తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇక రెండు రోజులుగా సీఎం చంద్రబాబు రేయిపగలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ..బాధితుల కష్టాలు అడిగితెలుసుకున్నారు. అత్యంత విషాదకర విషయం ఏంటి అంటే చనిపోయిన మృతదేహాలు (Dead Bodies) వరదల్లో కొట్టుకురావడం అందర్నీ కలిచి వేస్తుంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని,.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు సీఎం (CHandrababu) ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
వరదల తీవ్రతపై చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన బుధవారం నాడు టెలికాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కాలనీలు, ఇళ్లలో ఉన్న బురదను తొలగించేందుకు పని చేయాలని ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకురావాలన్నారు… ప్రతి ఇంటికి సహాయం అందించాలి అని సూచించారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలని,.. ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందజేయాలని సూచించారు.
వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి ఆహారం అందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రతికుటుంబానికి నిత్యవసర సరుకులు అందించాలని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీల ఉల్లిగడ్డలు, 2 కేజీల ఆలుగడ్డలు, కేజీ చక్కెర ఇవ్వాలన్నారు. మొబైల్ రైతుబజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకు కూరగాయలు ఇవ్వాలని తెలిపారు. అంబులెన్స్‌లన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని, . శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలన్నారు. ప్రతి ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాలని సూచించారు. వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, . ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలని సూచించారు.. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అంటూ.. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించడంతో పాటు పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read Also : Pawan Kalyan Donation : తెలంగాణకు కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్