Chandrababu : చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగింపు

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) జ్యూడిషియ‌ల్ రిమాండ్‌ను న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ రోజుతో

  • Written By:
  • Updated On - October 19, 2023 / 02:05 PM IST

Chandrababu Remand Extended : టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు జ్యూడిషియ‌ల్ రిమాండ్‌ను న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ రోజుతో చంద్ర‌బాబు రిమాండ్ (Chandrababu Remand) ముగుస్తుండ‌టంతో ఆయ‌న్ని వ‌ర్చువ‌ల్‌గా ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తి ముందు జైలు అధికారులు హాజ‌రుప‌రిచారు. ఈ సందర్భంగా జైల్లో త‌న భ‌ద్ర‌త‌పై అనుమానాలు ఉన్నాయ‌ని ఏసీబీ కోర్టు జ‌డ్జికి చంద్ర‌బాబు తెలిపారు. అనుమానాలు ఉంటే రాత‌పూర్వ‌కంగా ఇవ్వాల‌ని చంద్ర‌బాబుకు ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తి సూచించారు. చంద్ర‌బాబు రాసే లేఖ‌ను త‌న‌కు అందించాల‌ని జైలు అధికారుల‌ను న్యాయ‌మూర్తి ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

దాదాపు 40 రోజులుగా చంద్ర‌బాబు (Chandrababu) రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో జ్యూడిషియ‌ల్ రిమండ్‌లో ఉన్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబుకు అల‌ర్జీ రావ‌డం, డ్రీహైడ్రేష‌న్‌కు గురికావ‌డంతో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల ఆందోళ‌న‌తో జైలు అధికారులు రాజ‌మండ్రి ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యుల‌తో ఆయ‌న‌కు చికిత్స అందించారు. ఇటు జైల్లో ఏసీ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని.. చంద్ర‌బాబు త‌రుపున న్యాయ‌వాదులు కోర్టును ఆశ్ర‌యించారు. కోర్టు చంద్ర‌బాబుకు ఏసీ సౌక‌ర్యం త‌క్ష‌ణ‌మే క‌ల్పించాల‌ని ఆదేశించింది. దీంతో జైలు అధికారులు అదే రోజు రాత్రి ఏసీని ఏర్పాటు చేశారు. మ‌రోవైపు రేపు సుప్రీంకోర్టులో చంద్ర‌బాబు క్వాష్ పిటిష‌న్‌పై తీర్పు రానుంది. చంద్ర‌బాబుకు అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

Also Read:  Adilabad: ఓటు అడగొద్దు, మా గ్రామంలోకి అడుగుపెట్టొద్దు.. పొలిటికల్ లీడర్స్ కు గ్రామస్తుల వార్నింగ్