ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly)లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా కామినేని, బాలకృష్ణ (Kameneni Vs Balakrishna)మధ్య చోటుచేసుకున్న మాటల తూటాలు సత్తా చాటగా, ఆ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాను కూటమి నాయకుడిగా, సభలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తానని, ఇలాంటి ఎపిసోడ్లు రిపీట్ కాకూడదని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుధీర్ రెడ్డి, బొండా ఉమా, బూర్ల ఆంజనేయులకు క్లాస్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మరియు విప్‌లపై కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు
బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్పందించగా, అదే సందర్భంలో పవన్ కల్యాణ్, నాగబాబు మాత్రం మౌనం దాల్చడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలనలో ఒక వైపు అన్నయ్య చిరంజీవి, మరో వైపు కూటమి నాయకుడు బాలకృష్ణ ఉండటంతో పవన్ కల్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. చిరంజీవి అభిమానులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసనలకు సిద్ధమవుతున్నారు. రేపు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం ఈ వివాదం తీవ్రతను సూచిస్తోంది.
ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు కూడా బాలకృష్ణపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, చిరంజీవి జగన్‌ను కలిసే సందర్భంలో బాలకృష్ణ కూడా అపాయింట్‌మెంట్ కోరారని, ఆయన కోసం ప్రయత్నాలు జరిగాయని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో బాలకృష్ణ క్యాంప్ ఒక రకంగా ఆత్మరక్షణలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. మరోవైపు, పవన్ క్యాంప్ ఈ వివాదంపై ఓపెన్‌గా వ్యతిరేకించలేక, సమర్థించలేక తర్జనభర్జన పడుతోంది. రెండు వైపులా మౌనం దాల్చి కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ వివాదం సమసిపోతుందా, లేక కొత్త మలుపు తిరుగుతుందా అనేది రాబోయే రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.