టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాడా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. ఏపీ (AP) లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధినేత చంద్రబాబు (Chandrababu)..మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నారు. కాకపోతే బాబు ను పలు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో(Skill Development Case) ఆరోపణలు ఎదురుకుంటూ దాదాపు 52 రోజుల పాటు జైల్లో గడిపారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ (Bail) ఫై బయటకు వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ బెయిల్ గడువు కూడా దగ్గర పడడం తో బాబు తరుపు లాయర్లు బెయిల్ ను పొడగించాలని కోరుతున్నారు. ఒకవేళ కోర్ట్ బెయిల్ ను పొడిగిస్తే బాబు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం మొదలుపెట్టాలని చూస్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ (TDP) పార్టీ జనసేన (Janasena) తో కలిసి బలికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు కలిసి ప్రచారం చేస్తున్నాయి. ఇక ఇప్పుడు బాబు కూడా ప్రజల్లోకి వస్తే పార్టీల బలం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటె లోకేష్ (Nara Lokesh) సైతం యువగళం (Yuvagalam) పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ నెల 24న రాజోలు నుండి తిరిగి తన యాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన రాజోలు నియోజక వర్గంలో పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బౌ అరెస్టుతో పాదయాత్రను నిలిపివేశారు. దాదాపు రెండున్నర నెలలుగా పాదయాత్ర నిలిచిపోయింది. యాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే యాత్రను ప్రారంభించాలని చూస్తున్నారు.
Read Also : Gannavaram: ప్రాణం తీసిన ఫొటోషూట్, గన్నవరంలో చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు