Site icon HashtagU Telugu

Chandrababu : ఢిల్లీ లో బ్రేక్ లేకుండా చంద్రబాబు బిజీ బిజీ

Cbn Delhi

Cbn Delhi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో దూకుడు పెంచారు. పలు కీలక కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని కోరారు. హోంమంత్రి అమిత్ షాతో భద్రతా చట్టాలు, నిర్మలా సీతారామన్‌తో రాష్ట్రానికి రావలసిన నిధులపై చర్చలు జరిపారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన చంద్రబాబు, ఏపీలో BEL డిఫెన్స్ కాంప్లెక్స్, ఏరోస్పేస్ పరిశ్రమలపై వ్యూహాత్మక ప్రణాళికలను వివరించారు.

Mallojula Venugopal Rao: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ సరెండర్ ?

అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఏపీ కీలకంగా మారాలని భావించిన సీఎం చంద్రబాబు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర్ సింగ్‌ను కలసి స్పేస్ సిటీల ఏర్పాటుపై చర్చించారు. షార్ సమీపంలో ఒక స్పేస్ సిటీ, లేపాక్షిలో మరో స్పేస్ సిటీ నిర్మాణానికి సహకారం కోరారు. ఉపగ్రహాల తయారీ, ప్రయోగ వాహనాల అభివృద్ధి, పరిశ్రమల ఒడిదుడుకుల్లో ఏపీ ప్రముఖ కేంద్రంగా మారేందుకు ఇవి దోహదపడతాయని వివరించారు. కేంద్ర మద్దతుతో అంతరిక్ష పరిశ్రమలో ఏపీకి విశిష్ట స్థానం కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఇక నీటి వనరుల వినియోగం, పునరుత్పత్తిక ఇంధన రంగాల అభివృద్ధిలోనూ రాష్ట్రానికి మద్దతు కావాలని చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జల్ శక్తి మంత్రి CR పాటిల్‌ను కలసి పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై వివరాలు సమర్పించారు. అలాగే ప్రహ్లాద్ జోషీతో సమావేశమై, పీఎం సూర్యఘర్ యోజన కింద రాష్ట్రానికి సోలార్ ప్యానెల్స్ కేటాయించాలని కోరారు. గృహాలకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి కేంద్రం సబ్సిడీ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రం అభివృద్ధికి కేంద్ర మద్దతు అందించేందుకు చంద్రబాబు ఉత్సాహంగా కృషి చేస్తున్నారు.

Exit mobile version