Site icon HashtagU Telugu

Inner Ring Road Case : నవంబర్ 07 కు వాయిదా పడ్డ చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ

Chandrababu Jail

Chandrababu Jail

చంద్రబాబు కేసు (Chandrababu Case) అనగానే ఇంకేముంది వాయుదనే కదా అని ఇప్పుడు అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొన్నటి వరకు చంద్రబాబు కేసు విచారణ కోర్ట్ (Court) లలో కొనసాగబోతుంది అంటే ఏమవుతుందో..తీర్పు ఏమిస్తారో అనే ఉత్కంఠ నెలకొనే ఉండే..కానీ ఆ తర్వాత కింది కోర్ట్ ల నుండి సుప్రీం కోర్ట్ ల వరకు అన్ని వాయుధాలే వేస్తుండడం తో ప్రజలు సైతం వాయిదా..అనే మాటే అలవాటు చేసుకుంటున్నారు. తాజాగా ఈరోజు ఏపీ హైకోర్టు (Ap High court) లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు (Inner Ring Road Case) కూడా అలాగే వాయిదా పడింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను వచ్చేనెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఇప్పటికే ఇన్నర్ రింగ్ కేసులో 500 పేజీల కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ మార్చడం ద్వారా చంద్రబాబు కుటుంబ సభ్యులు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని‌ రమేష్ లకు లబ్ది చేకూర్చారని కౌంటర్ లో పేర్కొంది సీఐడీ. మరోవైపు.. లేని ఇన్నర్ రింగ్ రోడ్ పై కేసు నమోదు చేసిందని ఆరోపిస్తున్నారు చంద్రబాబు తరపు అడ్వకేట్లు. దీని మీద ఇవాళ కూడా వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు విజయవాడ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు.

Read Also : ISRO: గగన్‌యాన్ మిషన్‌కు తొలి పరీక్ష చేపట్టేందుకు ఇస్రో సిద్ధం