Site icon HashtagU Telugu

Chandrababu : నేడు సీఐడీ క‌స్ట‌డీకి చంద్ర‌బాబు.. విచారించ‌నున్న 9 మంది సీఐడీ అధికారులు

Chandrababu Verdict

Chandrababu Verdict

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో నేడు చంద్ర‌బాబును సీఐడీ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకోనున్నారు. రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లోనే విచారించాల‌ని ఏసీబీ కోర్టు సీఐడీ అధికారుల‌ను ఆదేశించింది. ప్ర‌తి గంట‌కు ఐదు నిమిషాల పాటు ఆయ‌న‌కు బ్రేక్, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇవ్వాల‌ని ఏసీబీ కోర్టు ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. చంద్రబాబును 9మంది సీఐడీ అధికారులు విచార‌ణ చేయ‌నున్నారు. ఉద‌యం 9.30 గంట‌ల నుంచి సాయంత్ర 5 గంట‌ల వ‌ర‌కు విచార‌ణ‌కు ఏసీబీ కోర్టు అనుమ‌తి ఇచ్చింది. ఇవాళ ,రేపు సీఐడీ కస్టడీలో చంద్రబాబు ఉండ‌నున్నారు.

సీఐడీ డీఎస్పీ ధనుంజేయుడు నేతృత్వంలో 9 మంది విచారణ బృందం మరికాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకోనుంది. 9:30 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ప్రారంభం కానుంది. విచారణ అధికారులుగా ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతో పాటు ఎఎస్ఐ, కానిస్టేబుల్ ఉన్నారు. సెంట్రల్ జైల్ కాన్ఫరెన్స్ హాల్లోనే సీఐడీ బృందం విచారించనుంది. ఏసీబీ కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణ కొనసాగనుంది. విచారణ మొత్తాన్ని ఒక వీడియో గ్రాఫర్, ఇద్దరు టైపిస్టులు రికార్డ్ చేయనున్నారు. చంద్రబాబు తరుపు న్యాయవాది సమక్షంలో విచారణ జరగనుంది.