Site icon HashtagU Telugu

Mahasena Rajesh : చంద్రబాబు నాకు ఏ హామీ ఇవ్వలేదు – మహాసేన రాజేష్

Mahasena Rajesh Babu

Mahasena Rajesh Babu

పి.గన్నవరం (P.Gannavaram) బరిలో నుండి టీడీపీ (TDP) అధిష్ఠానం తనను తప్పించడంపై మహాసేన రాజేశ్ (Mahasena Rajesh) స్పందించారు. ‘నేను నిన్న చంద్రబాబును కలిశా. నాకు ఏ హామీ ఇవ్వలేదు. పాత వీడియోలు వైరల్ అయిన తర్వాత నేను స్పందించిన తీరుపై చంద్రబాబు మెచ్చుకున్నారు. 18 రోజుల నుంచి బయటికి రావాలంటే నాకు సిగ్గుగా ఉండేది. ఈ విషయాన్ని పార్టీ అధినేతకు చెబితే నువ్వు ఎప్పుడూ హీరోగానే తిరగాలని అన్నారని’ రాజేష్ చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.

కోనసీమ అంబేద్కర్ జిల్లా పి.గన్నవరం రాజకీయాలు రోజు రోజుకు మలుపులు తిరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ పేరును టీడీపీ మొదటి జాబితాలో ప్రకటించింది. కానీ రాజేష్ కు టికెట్ ఇవ్వడం ఫై టీడీపీ , జనసేన శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గంలో రాజేష్ కు అసలు బలం లేదని..కనీసం ప్రజలను పెద్దగా పలకరించింది లేదని అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ తీవ్రంగా ఆందోళన చేసారు. దీంతో టీడీపీ ఆలోచన చేసి..జనసేన కు ఆ స్థానాన్ని కేటాయించింది. దీంతో జనసేన తరుఫున పవన్ కళ్యాణ్.. పి. గన్నవరం స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు. రెండు నెలల కింద జనసేనలో చేరిన గిడ్డి సత్యనారాయణను పి. గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు. గిడ్డి సత్యనారాయణ హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పనిచేశారు. తనకు టికెట్ రాలేదని చెప్పి..రాజేష్ పార్టీ కి , పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతాడేమో అని అంత భావించారు కానీ..రాజేష్ మాత్రం టికెట్ రాకపోవడం తో పెద్దగా బాధపడలేదని స్వయంగా ఆయనే తెలుపడం తో అంత హమ్మయ్య అనుకుంటున్నారు.

Read Also : AP Govt Helps : జనసేన సైనికుడికి…జగన్ సాయం