Site icon HashtagU Telugu

Chandrababu : NDA లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు

Cbn Clarty

Cbn Clarty

ఏపీలో కూటమి సంచలనం సృష్టించింది. 164 స్థానాలతో సత్తా చాటింది. వైనాట్ 175 అంటూ మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకొని , కనీసం ప్రతిపక్ష పాత్ర కు కూడా ఛాన్స్ లేకుండా అయ్యింది. ఈ గెలుపు ఫై చంద్రబాబు (Chandrababu) మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో పలు ప్రచారాలకు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు NDA కు సపోర్ట్ ఇస్తారా..లేక ఇండియా కూటమి కి సపోర్ట్ ఇస్తారా అనేదానిపై స్పష్టత ఇచ్చారు. తాము NDA తోనే ఉండబోతున్నామని..ఈరోజు NDA సమావేశానికి హాజరు కాబోతున్నట్లు తెలిపారు.

ఇంతటి చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఈ గెలుపునకు కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉండడం సాధారణమైన విషయం. కానీ దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం… అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి, వ్యక్తులు కూడా కనుమరుగవుతారు. కానీ ఇంతటి చారిత్రక ఎన్నికల ఎప్పుడూ చూడలేదు. నా జీవితంలో చాలా ఎన్నికలు చూశాను… వాటిలో వేవ్ కనిపించేది, ఏదైనా పార్టీపై వ్యతిరేకత కనిపించేది… కానీ ఈ ఎన్నికలు చూస్తే… కసి కనిపించిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్య కు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని సవాల్ చేశా..ఆ సవాల్ కు ప్రజలు సపోర్ట్ ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ‘ఈ ఐదేళ్లు మా కార్యకర్తలకు నిద్ర లేకుండా చేశారు. అహంకారులైన పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పారు. కూటమికి 58.38% , TDPS 45%, YCPS 39% ఓట్లు వచ్చాయి. స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఈ ఫలితం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది’ అని అన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పు చూస్తే… అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, నేనేమైనా చేస్తాను అనే ధోరణిని ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు… అదే ఈ రోజు నిరూపించారు. ఈ గుణపాఠం పాలకులకే కాదు… అవినీతి, అహంకారంతో ముందుకుపోయే ఎలాంటి విధ్వంసకారులకైనా ఇదే జరుగుతుంది అని ప్రజలు చాటి చెప్పారు. అందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని తెలిపారు.

కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణే అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చారని కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒకతాటిపైకి వచ్చి సమష్టిగా పని చేశాయని తెలిపారు. ‘గత ఐదేళ్లలో వ్యవస్థలు, ఎకానమీ కుప్పకూలాయి. ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారు. అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలీదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు. మేం సూపర్ సిక్స్, ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం… ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ప్రజల్లో ఒక ఆశావహదృక్పథం ఏర్పడింది. వీటన్నింటి ఫలితాలే నిన్న కూటమి విజయాల రూపంలో వచ్చాయన్నారు.

Read Also : CBN Is Back : బాబు వచ్చాడు…CID చీఫ్ సంజయ్ పరిస్థితి ఎలా ఉంటుందో..?