Site icon HashtagU Telugu

Chandrababu Greatness : ఆంధ్రుడా ఆలోచించు.!ప్రొఫెసర్ హ‌ర‌గోపాల్ మాట‌ల్ని ఆల‌కించు!!

Chandrababu Greatness

Chandrababu Greatness

Chandrababu Greatness : `మ‌న ముందున్న‌ప్పుడు ఎవ‌రి విలువ తెలియ‌దంటారు పెద్ద‌లు. జైలుకు చంద్ర‌బాబు వెళ్లే వ‌ర‌కు ఆయ‌న విలువ కొంద‌రికి తెలియ‌లేదు. ఇప్పుడు అన్ని రంగాల వాళ్ల‌కు తెలుస్తోంది.` ఆయ‌న విలువను తెలుసుకోవాలంటే సామాన్యుల‌కు ఒక మాత్రాన అర్థం కాదు. భావోద్వేగాలు, కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు భిన్నంగా ఆలోచిస్తే చంద్ర‌బాబు అంటే ఏమిటో తెలుస్తోంది. ఆయ‌న గొప్ప‌త‌నం గురించి ప్ర‌స్తుత స‌మాజానికి తెలియ‌చేయ‌డానికి ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ వంటి సంఘ సంస్క‌ర్త‌, సామాజిక‌వేత్త ముందుకు రావ‌డం గ‌మ‌నార్హం.

భావోద్వేగాలు భిన్నంగా ఆలోచిస్తే చంద్ర‌బాబు అంటే తెలుస్తోంది  (Chandrababu Greatness)

ప్రొఫెస‌ర్ హరగోపాల్, తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు, చరిత్ర పరిశోధకుడు. 2022లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మ‌హోన్న‌త వ్య‌క్తి. సమాజానికి ఆయ‌న సంప‌ద‌. వామ‌ప‌క్ష భావ‌జాలాన్ని పుణికిపుచ్చుకున్న హ‌రిగోపాల్ ఇప్పుడు చంద్ర‌బాబు అరెస్ట్, జైలుకు పంపించ‌డంపై ఆవేద‌న చెంద‌డంపై ప్ర‌స్తుత త‌రం ఆలోచించాలి. జీవితాన్ని స‌మాజానికి అంకితం చేసిన హ‌ర‌గోపాల్ వంటి మ‌హోన్న‌తులు కూడా చంద్ర‌బాబు (Chandrababu Greatness) జైలుకు పోవ‌డాన్ని ఖండిస్తున్నారు. కానీ, ఏపీ స‌మాజం మాత్రం ఆయ‌న విలువ‌ను తెలుసుకోలేక‌పోతోంది.

చంద్ర‌బాబు అరెస్ట్, జైలుకు పంపించ‌డంపై  హ‌రిగోపాల్ ఆవేద‌న

ఏపీ స‌మాజాన్ని మ‌తం, ప్రాంతం, కులం ప్రాతిప‌దిక‌న 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌వంతంగా విభ‌జించారు. భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్టడానికి బీహార్ కు చెందిన ప్ర‌శాంత్ కిషోర్ ను ప్ర‌యోగించారు. ద‌శాబ్దాల పాటు నిలిచిపోయేలా మ‌త‌, ప్రాంత, కుల విద్వేషాల‌ను బీజం వేశారు. వాటిని రెచ్చ‌గొట్ట‌డం ద్వారా భావోద్వేగాల‌ను పెంచిపోషించారు. ఫ‌లితంగా 2019 ఎన్నిక‌ల్లో అభివృద్ధి, ఏపీ భ‌విష్య‌త్ తెర‌వెన‌క్కు వెళ్లింది. సీన్ క‌ట్ చేస్తే, ప్ర‌శాంత్ కిషోర్ అనుకున్న ఫ‌లితాల‌ను సాధించారు. ఆయ‌న స‌ర్వేలు, పెంచిపోషించిన కులం, మ‌తం, ప్రాంతం అనే విష‌బీజాలు మాత్రం పెరిగి పెద్ద‌వి అవుతున్నాయి. వాటి ప్ర‌భావం నుంచి ఏపీ స‌మాజాన్ని బ‌య‌ట‌కు తీసుకొస్తోన్న చంద్ర‌బాబును జైలుకు పంపారు. మ‌రో ఛాన్స్ కోసం రోడ్ల మీద‌కు రావ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ద‌మ‌వుతున్నారు. అందుకే, చంద్ర‌బాబు  (Chandrababu Greatness)విజ‌న్ గురించి హ‌రిగోపాల్ వంటి సామాజిక వేత్త‌లు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Also Read : CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక‌?, `పోచారం` రియాక్ష‌న్ తో అప్ర‌మ‌త్తం!

చంద్రబాబును జైల్లో పెడితే రాజకీయంగా తిరుగు ఉండదని సీఎం జగన్ భావించారని, అది ఆయనకే నష్టాన్ని చేకూర్చబోతోందని హ‌రగోపాల్ హెచ్చ‌రించారు. జైలుకు వెళ్లడం వల్ల చంద్రబాబుకే లాభమని అంచ‌నా వేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం బాధాకరమని ఆవేదన చెందారు. ఇమేజ్ పెరుగుతోందనే చంద్ర‌బాబును జైల్లో పెట్టించారని హరగోపాల్ అభిప్రాయ‌ప‌డ్డారు. చంద్రబాబు ఒక వ్యూహకర్తని, ఆయన జైలుకు వెళ్లడం వల్ల సానుభూతి (Chandrababu Greatness) పెరుగుతోందని అన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను  కోల్పోతోందని తీవ్ర వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

Also Read : YCP is not Single : సింహం సింగిల్ కాదు, ఆయ‌న‌కు ముగ్గురు..!

ఇదే సమయంలో చంద్రబాబుపై హరగోపాల్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి తమకు కూడా ఉంటే బాగుంటుందని తనతో ఇతర రాష్ట్రాల వారు కూడా చెప్పారని గుర్తు చేశారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబే అని చెప్పారు. సాఫ్ట్ వేర్ రంగానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ చంద్రబాబే అని కొనియాడారు. గతంలో చైనా నుంచి ఒక బృందం వచ్చిందని, చంద్రబాబును కలవకుండా వెళ్లమని త‌న‌కు చెప్పారని హ‌రిగోపాల్ గుర్తు చేశారు. అంత‌టి గొప్ప నాయ‌కుని విలువ ఏపీలోని స‌మాజానికి తెలియ‌క‌పోవ‌డం దుర‌దృష్టం. అందుకే, ఉన్న‌ప్పుడు విలువ తెలియ‌దు. లేన‌ప్పుడు తెలుసుకుని మాత్రం ఉప‌యోగం ఏమి ఉంటుంది. ఇప్ప‌టికైనా జ‌రిగిన న‌ష్టాన్ని గ‌మ‌నించి, ఏపీ స‌మాజం మేలుకుంటుంద‌ని ఆశిద్దాం.!