TDP vs YSRCP: జ‌గ‌న్ బిగ్ మిస్టేక్.. చంద్ర‌బాబుకు ఆయుధం దొరిన‌ట్టేనా..?

  • Written By:
  • Updated On - March 1, 2022 / 01:11 PM IST

వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్యలో ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా తెలుగుదేశంపార్టీ ముఖ్యనేతలతో జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో మాట్లాడిన‌ చంద్రబాబు జ‌గ‌న్ పై కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఇటీవ‌ల‌ వివేకా హత్యకు సంబంధించి, బయటకు వస్తున్న అన్ని వాంగ్మూలాలు జగనే దోషి అని స్పష్టం చేస్తున్నాయ‌ని చంద్ర‌బాబు అన్నారు.

వివేకా హ్య‌త్య కేసును మొద‌టి నుంచి త‌ప్పుప‌ట్టిస్తున్న జ‌గ‌న్, నాడు వివేకా హత్యను తనపై నెట్టి రాజకీయ లబ్ధి పొందారని చంద్ర‌బాబు తెలిపారు. తండ్రి హత్యపై న్యాయం చెయ్యాలని కోరిన సునీత పట్ల అన్నగా వ్యవహరించిన తీరుతో, జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది, 12వ కేసు అవుతుందని జగన్ చేసిన వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తే, అతనికి చట్టం అంటే లెక్కలేనితనాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

కేసును మొదటి నుంచి తప్పుదోవ పట్టిస్తున్న జగన్ ను సీబీఐ ముందుగా విచారించాలన్నారు. నాడు సిఎంగా ఉన్న నాపై హత్యానేరం మోపి జగన్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారనేది రుజువయ్యిందన్నారు. తండ్రి హత్యపై న్యాయం చెయ్యాలని కోరిన సునీత పట్ల అన్నగా వ్యవహరించిన తీరుతో జగన్ నైతికంగా పూర్తిగా పతనం అయ్యారని చంద్రబాబు అన్నారు. దీంతో విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే హక్కు జ‌గ‌న్‌కు లేద‌ని, అస‌లు సీఎం కుర్చీపై కూర్చునే అర్హత జగన్ ఏమాత్రం లేద‌ని చంద్ర‌బాబు స్పంష్టం చేశారు.

వివేకా హ్య‌త్య‌కు సంబంధించి సీబీఐ సేక‌రించిన ఆధారాల్నీ వైసీపీ హస్తాన్ని బయటపెడుతున్నాయ‌ని, ఆయ‌న హ‌త్య వెనుక ఉన్న‌ది వైసీపీ నేత‌లే అని, బాబాయి హ‌త్య కేసుతో అబ్బాయికి సంబంధం ఉంద‌ని, దీనిపై జ‌గ‌న్ పెద‌వి విప్పాల‌ని చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌కంప‌నలు సృష్టిస్తున్నాయి. మ‌రోవైపు టీడీపీ జాతీయ అధ్య‌క్ష‌డు నారా లోకేష్ కూడా వివేకా హత్య కేసును నాడు వైసీపీ రాజ‌కీయంగా వాడుకుంద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ల‌బ్ది పొంది విజ‌యం సాధించింద‌ని ఆరోపించిన విష‌యం తెలిసిందే.

ఇందులో కొంత నిజం ఉంద‌ని చెప్పాలి. నారాసుర ర‌క్త చ‌రిత్ర అంటూ గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చిన క‌థ‌నాలు టీడీపీ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బ‌తీశాయి. దీంతో టీడీపీ విజ‌యావ‌కాశాలు దెబ్బ‌తిన‌డానికి అదీ ఓ బ‌ల‌మైన కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. ఇక మూడేళ్ళుగా సాగుతున్న వివేకా హత్య కేసు ఎప్పుడు తేలుతుందో కానీ, ప్ర‌స్తుతం వైసీపీ స‌ర్కార్‌కు మాత్రం పెద్ద మ‌చ్చ‌లా మారింది. ఈ కేసు విషయమై వివేకానంద‌రెడ్డి కూతురు సునీతారెడ్డిని అన్న జ‌గ‌న్ అండ్ వైసీపీ నేత‌లు, అధికారుల పట్టించుకోకపోవడంతోనే, ఇప్పుడు ఇంత ర‌చ్చ జ‌ర‌గ‌డానికి కార‌ణం అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఎలా చూసినా రాజ‌కీయ చాణ‌క్యుడు అయిన చంద్ర‌బాబుకు వైసీపీ ఆయుధాన్ని అందించిన‌ట్టే అని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఆ ఆయుధంతో రాజ‌కీయంగా వైసీపీని ఎలా ఆటాడిస్తారో అనేది చూడాలి.