52 రోజులు తర్వాత జైలు నుండి చంద్రబాబు (Chandrababu) బయటకు వచ్చారు. బాబు ను చూసేందుకు వేలాదిగా టీడీపీ కార్యకర్తలు , అభిమానులు రాజమండ్రి జైలు వద్దకు వచ్చారు. జై బాబు ..జై బాబు అంటూ ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. ఎటు చూసిన టీడీపీ జెండాలతో , కార్యకర్తలతో కోలాహలంగా మారింది.
చంద్రబాబు కు బెయిల్ (Chandrababu Bail) రావడం ఫై యావత్ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development case)లో సెప్టెంబర్ 9న చంద్రబాబు ను నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ (Chandrababu Arrest) చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 10న ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. అనంతరం 10న అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బాబును తరలించారు. గత 52 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail)నే ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయినా దగ్గరి నుండి కూడా ఆయన్ను బయటకు తీసుకొచ్చేందుకు లాయర్లు ట్రై చేస్తూ వస్తున్నప్పటికీ..వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్య గా చంద్రబాబు ఫై అనేక కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసింది. ఇదే క్రమంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయనకు బెయిల్ మంజుల చేయాలనీ హైకోర్టు ను కోరారు. దీంతో ఏపీ హైకోర్టు (AP High Court) చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతిచ్చింది. రూ.1 లక్ష పూచీకత్తు, 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న చంద్రబాబు (Chandrababu), టీడీపీ అభిమానులకు కోర్టు తీర్పు సంతోషాన్ని కలిగించింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 28న బాబు తిరిగి సరండర్ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే పలు షరతులు విధించింది.
కొద్దీ సేపటి క్రితం రాజమండ్రి జైలు నుండి బయటకు వచ్చారు. బాబు ను చూసేందుకు వేలాదిగా టీడీపీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని ఆయనకు అభివాదం తెలిపారు. వేలాది మంది అభిమానులను చూసి బాబు చిరునవ్వుతో వారందరికీ అభివాదం తెలుపుతూ..నమస్కారం తెలిపారు. చంద్రబాబు వెంట బాలకృష్ణ , అచ్చెం నాయుడు తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారు. రోడ్డు మార్గం ద్వారా విజయవాడ కు చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Read Also : చంద్రబాబు బెయిల్ రావడం తో బండ్ల గణేష్ సంతోషంతో టపాసుల మోత