Site icon HashtagU Telugu

Inner Ring Road Case : సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఊరట..

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస తీపి కబుర్లు అందుతున్నాయి. ముఖ్యంగా తనపై అధికార పార్టీ పెట్టిన కేసుల్లో భారీ ఊరట లభిస్తూ వస్తున్నాయి. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం (AP Govt) వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (Inner Ring Road Case) కేసులో గతంలో ఏపీ హైకోర్టు (AP High Court) చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూపొందించిన అలైన్ మెంట్ లో మార్పులు చేసిన విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఇదే అంశంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణపైనా కేసులు నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ విచారణ కు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఏపీ సర్కార్ భావిస్తే..కోర్ట్ మాత్రం బాబు కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి.

ఇదిలా ఉంటె ప్రస్తుతం చంద్రబాబు ఫోకస్ అంత ఏపీ ఎన్నికలపై పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకొని రంగంలోకి దిగుతున్నాడు. ఓ పక్క అభ్యర్థుల ఎంపిక ఫై దృష్టి పెడుతూనే..మరోపక్క రా…కదలిరా పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ఎన్నికల హామీలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. అలాగే వైసీపీ ఫై విమర్శలు చేస్తూ..మరింత దూకుడు కనపరుస్తున్నారు.

Read Also : Kurnool: హనీట్రాప్ లో హైదరాబాద్ బిల్డర్, 20 లక్షలు ఇవ్వాలని బెదిరింపులు