Site icon HashtagU Telugu

Chandrababu : ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా

Chandra Babu (3)

Chandra Babu (3)

ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. అయితే.. ఇవాళ నంద్యాలలో ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. ఎక్కడైనా ఫ్యాన్ తిరిగితే అక్కడికి గొడ్డలి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మీ బాబాయ్ ని ఎవరు చంపారో ఇప్పటికైనా నిజం చెప్పు అని ఆయన సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. చెల్లెల్ని క్యారెక్టర్ ఆశశినేషన్ చేసే అన్న ఎవరైనా వుంటారా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. నేను వస్తే పథకాలు ఉండవని ప్రచారం చేస్తున్నారు…నేను పేదల పక్షాన ఉంటా అని, జనవరి లో బటన్ నొక్కితే ఇప్పటికి డబ్బులు పడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 99 శాతం హామీలు పూర్తి చేశాడట…..మీ జీవితంలో మార్పు వచ్చిందా అని చంద్రబాబు విమర్శించారు. హైద్రాబాద్ లో, విశాఖ లో, ఇడుపులపాయ లో, బెంగుళూరు లో ప్యాలెస్ కట్టుకున్నాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి సండే ఎమ్మెల్యే అని ఆయన విమర్శించారు. ఈ సండే ఎమ్మెల్యేను శాశ్వతంగా ఇంటికి పంపిద్దామని ఆయన అన్నారు. ఆడ బిడ్డలకు పెద్దన్నగా అండగా ఉంటానని, ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

We’re now on WhatsApp. Click to Join.

ముసలి వాళ్లకు 4 వేల పింఛన్లు ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపుతా అని చంద్రబాబు హామీ ఇచ్చారు. హైదరాబాద్, అమెరికాలో కంప్యూటర్ లు పెట్టుకున్నాడని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అయితే మీ భూములు మీకు ఉండవని చంద్రబాబు వెల్లడించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ లుగా జగన్ తన సొంత మనుషులను పెట్టు కున్నాడని, ఎన్ ఆర్ సి, సిఏఏల గురించి మాట్లాడే వైసీపీ వాళ్లు.. పార్లమెంటులో ఆ బిల్లులకు మద్దతు తెలిపారా లేదా అని ఆయన ప్రశ్నించారు.

మైనార్టీల రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది అని ఆయన వెల్లడించారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే సైకో జగన్ ఇక్కడికి వచ్చాడా.. ఓ వైపు నా ముస్లింలు అంటున్నాడు. మరోవైపు ముస్లింలను జగన్ ఊచకోత కోస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై నా రెండో సంతకం చేస్తాననని చంద్రబాబు అన్నారు.
Read Also : AP Elections : ఏపీ ఎన్నికలలో నగదు పంపిణీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు..!