TDP : తెలుగుదేశం – జనసేన గెలుపు అన్ స్టాపబుల్ .. గుడివాడ ‘రా..కదలిరా’ బహిరంగ సభలో చంద్ర‌బాబు

రాష్ట్రంలో టీడీపీ జ‌న‌సేన గాలి వీస్తుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలిపారు. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో రా.. క‌ద‌లిరా

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 07:20 AM IST

రాష్ట్రంలో టీడీపీ జ‌న‌సేన గాలి వీస్తుంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలిపారు. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో రా.. క‌ద‌లిరా బ‌హిరంగ స‌భలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. బూతులు మాట్లాడిన వారు ప్రజాగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయమ‌ని చంద్ర‌బాబు తెలిపారు. తెలుగుదేశం-జనసేన నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే.. తమకు ఎవరు ఎదురొచ్చినా తొక్కేస్తామనేలా ఉన్నారని.. తెలుగుదేశం-జనసేన గెలుపు అన్ స్టాపబుల్ అని అన్నారు. రా..కదలిరా సభను గుడివాడలోనిర్వహించడానికి కారణం.. దేశ రాజకీయాలను తిరగరాసిన నాయకుడు పుట్టిన ప్రాంతం కావడమేన‌ని తెలిపారు. ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడి సత్తాను, శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. సంక్షేమ పథకాలకు ఆద్యుడు.. సుపరిపాలనకు బాటలు వేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

We’re now on WhatsApp. Click to Join.

నిమ్మకూరులో పుట్టి.. చిత్రసీమను, రాష్ట్రాన్ని ఏలిన .. కథానాయకుడు, మహానాయకుడు, యుగపురుషుడు ఎన్టీఆర్ అని చంద్ర‌బాబు తెలిపారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచింది ఈ గుడివాడ నుంచే అని.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైందన్నారు. ఎందరో మహామహులు పుట్టి, నడయాడిన తులసివనంలో ఇప్పుడు గంజాయి మొక్కలు పుట్టాయని మాజీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి మాట్లాడారు. అధికారమంటే బూతులు.. దోపిడీ.. కేసినోలు.. పేకాటలు.. కబ్జాలు చేయ‌డమే వీళ్ల‌కు తెలిస‌న ప‌ని అని అన్నారు. సంక్రాంతికి కూడా కేసినోలు .. జూదక్రీడలు నిర్వహించి డబ్బులు కొట్టేస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ 8 సంవత్సరాలు.. తాను 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నామ‌ని.. 22 ఏళ్లలో ఆలోచించి ఉంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేవా? అని కార్య‌క‌ర్త‌ల‌ను అడిగారు

ముఖ్యమంత్రి పదవికి అర్హతలేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడని.. బూతు శ్రీ అయిన వ్యక్తికి ఎమ్మెల్యే పదవి.. బూతురత్నకు ఎంపీ పదవి.. బూతుసామ్రాట్ అయితే మంత్రి పదవి.. ఇదీ ఈనాడు రాష్ట్రంలో సాగుతున్న రాజకీయమ‌న్నారు. ఎంపీలంటే పార్లమెంట్ లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావాలి. కానీ ఇక్కడున్న సైకో అవన్నీ అవసరం లేదంటున్నాడని.. చంద్రబాబుని తిట్టావా.. పవన్ కల్యాణ్ ను తిట్టావా.. లోకేశ్ ను తిట్టావా.. అవేవీ చేయలేదు కాబట్టి..నీకు టిక్కెట్ ఇవ్వను అంటున్నాడ‌న్నారు. గుడివాడ ప్రజలకు ప్రధాన సమస్య.. ఇక్కడున్న ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యేను చిత్తుచిత్తుగా ఓడించి, గుడివాడ నియోజకవర్గాన్ని ప్రక్షాళన చేయండని ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. ఇక్కడున్న ఎమ్మెల్యే నోరు తెరిస్తే బూతులే. అది నోరు కాదు.. మురికి కాలువే. ఎంత శుభ్రపరిచినా అది ఎప్పటికీ మురికికాలువే. నా వద్ద ఓనమాలు నేర్చుకొని నాకే పాఠాలు చెప్పేవారికి నేనేంటో చూపిస్తాన‌ని చంద్ర‌బాబు హెచ్చిరించారు. నోరు పారేసుకుంటే భవిష్యత్ లో జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

Also Read:  Khammam: ఖమ్మంలో కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన