Site icon HashtagU Telugu

TDP : అరాచ‌క ప్ర‌భుత్వానికి ముంగింపు ప‌ల‌కాలి.. తిరువూరు స‌భ‌లో చంద్ర‌బాబు

TDP

TDP

నాలుగేళ్లలో రాష్ట్రం వెనుకబడిపోయిందని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు . తిరువూరు జిల్లాలో రా కద‌లి రా పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ప్ర‌తి ఒక్క‌రు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఉంటే అమరావతి కూడా అభివృద్ధి చెంది ఉండేదన్నారు ఒక వ్య‌క్తి చర్యల కారణంగా ఒక త‌రం ఎంత‌ న‌ష్ట‌పోతుందో ఆలోచించాల‌న్నారు. ప్రతికూల పరిణామాలు తనతో సహా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయని.. ప్రస్తుతం ఉన్న అరాచక ప్ర‌భుత్వానికి ముగింపు పలకాలని పేర్కొన్నారు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది త‌న ఆకాంక్ష అని.. ప్రపంచంలోనే రాజకీయాలను శాసించే సమయం మన వాళ్లకు వస్తుందన్నారు.

గ్లోబల్ లీడర్ లా తెలుగు వాళ్లు మారడానికి నిచ్చెన్నలా టీడీపీ ఉందని.. 25 ఏళ్లకు ముందు తాను తెచ్చిన ఐటీ పిల్లలకు ఆయుధంలా మారిందని తెలిపారు. ఇటీవల త‌న‌కు ఇబ్బంది వచ్చినప్పుడు దాదాపు 80 దేశాల్లో నిరసన తెలియజేశారని తెలిపారు. సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు నాంది పలకబట్టే నేడు హైదరాబాద్ వెలిగిపోతుందన్నారు. మరో వైపు అమరావతి వెలవెల పోవడానికి కారణం జగన్ రివర్స్ పాలనేన‌ని.. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా.. కదలిరా.. కార్యక్రమాన్ని చేపట్టామ‌ని.. ఇది మా కోసం కాదు 5 కోట్ల ప్రజల కోసం పిలుపునిస్తున్నామ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ-జనసేన కూటమి ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని, రానున్న ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి లక్ష్యమని చంద్ర‌బాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి నెలా నిరుద్యోగుల‌కు భృతి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మహాలక్ష్మి పథకం ద్వారా మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పౌరులకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామ‌ని చంద్ర‌బాబు తెలిపారు. అంతకుముందు తిరువూరు చేరుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు తెలంగాణ సరిహద్దు కావడంతో ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి నాయకులు భారీ వాహనాల్లో స‌భ‌కు హాజ‌రూయ్యారు.

Also Read:  Kite festival: అహ్మదాబాద్‌లో కైట్ ఫెస్టివల్ సందడి.. హైదరాబాద్‌లో ఎప్పటి నుంచి అంటే..