ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. వరుస భారీ బహిరంగ సభలకు షెడ్యూల్ ఫిక్స్ చేసాడు. ఇదిలా ఉంటె గత మూడు రోజులుగా కుప్పం (Kuppam) నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాబు..జగన్ ఫై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. ఇక శనివారం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్‌కు చేరుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. అంగన్వాడీ శిబిరానికి వెళ్లి అంగన్వాడీల ఆందోళనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAS) ప్రజా ద్రోహులుగా మారారని, అందుకు కారణమైన సైకో పాలనకు బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదని, ఏ ఒక్కరికి ఉద్యోగావకాశం కల్పించలేదని పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఏ రోజు ఏ తప్పు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. హంద్రీనీవాలో నీళ్ళు పారించమంటే అవినీతి పారిస్తున్నారు. బటన్లు నొక్కి డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. అందరూ రోడ్డున పడ్డారు. సీఎం మాత్రం ప్యాలెస్ లో ఉన్నారంటూ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also : Condoms : ఒక్కడే 2023 లో 9940 కండోమ్స్ ఆర్డర్ చేసాడట..