మిగ్ జాం తూఫాన్ (Michaung Cyclone) దెబ్బకు ఏపీ (AP) వణికిపోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం తుపాను ప్రస్తుతం తీరం దాటినప్పటికీ రేపు కూడా ఏపీ లో భారీ వర్షాలు పడనుండగా..తెలంగాణ లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నాయి. ఇదిలా ఉంటె మిగ్ జాం తుపాను పట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం (Jagan Govt) విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేసారు. తుపాను పరిస్థితిపై టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో ఆయన ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాలని, కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం తీరు, బాధితులకు ఆహారం కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగానే హెచ్చరికలు వచ్చినా, తగు చర్యలు జగన్ ప్రభుత్వం చేపట్టలేదన్నారు. తుపాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదని, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన పరిహారం అందించాలన్నారు. హుద్ హుద్, తిత్లీ వంటి తుపానుల సమయంలో టీడీపీ హయాంలో ఎలా బాధితులకు సహాయం అందించామో గుర్తు చేశారు.
Read Also : Revanth Reddy Govt : జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్
