AP : మహిళలపై దాడులు చేస్తున్న పట్టించుకోని ఏపీ పోలీస్ – చంద్రబాబు

టీడీపీ నేతలపైనే కాదు కార్యకర్తలపై కూడా దాడులకు తెగపడుతున్నారు. పల్నాడు, తిరుపతి , అనంతపురం , తాడిపత్రి తదితర జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేసిన వైసీపీ రౌడీ మూక..ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వైజాగ్ ను కూడా వదలడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు వాపోయారు

  • Written By:
  • Updated On - May 16, 2024 / 07:14 PM IST

ఎన్నికల పోలింగ్ (AP Polling) వరకు కూడా ఏపీ (AP) ప్రశాంతంగా ఉంది..కానీ ఎప్పుడైతే పోలింగ్ మొదలైందో..అప్పటి నుండి వైసీపీ (YCP) మూకలు రెచ్చిపోతున్నారు. పోలింగ్ రోజే నుండి మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేతలపైనే కాదు కార్యకర్తలపై కూడా దాడులకు తెగపడుతున్నారు. పల్నాడు, తిరుపతి , అనంతపురం , తాడిపత్రి తదితర జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు చేసిన వైసీపీ రౌడీ మూక..ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వైజాగ్ ను కూడా వదలడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వాపోయారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఏపీ పోలీస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలం అవుతున్నారని మండిపడ్డారు. నిన్నటి వరకు పలు జిల్లాలో దాడులు జరుపుతూ వచ్చిన వారు..ఇప్పుడు ఈ హింస ప్రశాంతమైన విశాఖకు కూడా తీసుకొచ్చారన్నారు. నగరంలోని నార్త్ నియోజకవర్గంలో వైసీపీ ఇచ్చిన డబ్బులను నిరాకరించి…టీడీపీకి ఓటు వేశారన్న కారణంతో నలుగురిపై దారుణంగా దాడి చేసినట్లు తెలిపారు. ఆడవాళ్లపై కూడా పాశవిక దాడికి పాల్పడ్డారన్నారు. వైసీపీ మూకలు చేస్తున్న దాడుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి అని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పల్నాడులో ఇప్పటికీ సమస్య పరిష్కారం రాలేదు. వైసీపీ రౌడీ మూకలు ఇళ్లలో బాంబులు, మారణాయుధాలు పెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి గూండాలను అరెస్టు చేయాలనీ కోరారు. మాచర్లలో మారణహోమానికి కారణం అయిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేస్తే తప్ప అక్కడ దాడులు ఆగే పరిస్థితి లేదు.

అలాగే విజయవాడ భవానీపురంలో పోలింగ్ రోజు జరిగిన దాడి కేసులో నిందితుడు… పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేత స్టేషన్ నుంచి పారిపోవడం పోలీసుల ఉదాసీన వైఖరికి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల హింసలో నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపాలి. తప్పు చేసిన పోలీసు అధికారులను బదిలీ చేయడమే కాకుండా… వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also :  Movie Theaters : థియేటర్ల బంద్ ఫేక్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతల సంఘం..