CBN : బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు మీకు కావాలా..? – చంద్రబాబు

మీ బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడు.. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఉద్దేశించి బాబు ప్రశ్నలు సంధించారు

  • Written By:
  • Publish Date - March 31, 2024 / 08:11 PM IST

ఓ పక్క భానుడు భగభగమంటున్న సరే ఏమాత్రం లెక్కచేయకుండా చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ప్రచారం చేస్తూ వస్తున్నాడు. వరుస సభలతో , పర్యటనలతో ప్రజలను కలుస్తూ వస్తున్నారు. ప్రజాగళం (Prajagalam) పేరుతో ప్రచారం చేస్తూ వస్తున్న బాబు..ఈరోజు మార్కాపురం ( Markapuram) లో ఏర్పటు చేసిన భారీ సభలో ప్రసంగించారు.

మీ బాబాయ్‌ని ఎవరు చంపారో చెప్పమంటే చెప్పడు.. బాబాయిని చంపే వాళ్లు, కోడికత్తి డ్రామాలు ఆడేవాళ్లు, కంటైనర్లలలో నగదు పంపే వాళ్లు మీకు కావాలా? అంటూ ప్రజలను ఉద్దేశించి బాబు ప్రశ్నలు సంధించారు. అందుకు ప్రతిగా ప్రజలు లేదు లేదంటూ సమాధానం ఇచ్చారు. జనం నాడి తెలిసిపోయిందని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు. బటన్ నొక్కానని ముఖ్యమంత్రి రోజూ మాట్లాడుతున్నారు.. జగన్‌కి బటన్ నొక్కింది ఎంత.. బొక్కింది ఎంతో సమాధానం చెపే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. వెలుగొండకు ఫౌండేషన్ వేసింది తానేనని.. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారన్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే వెలుగొండ నుంచి 2020కే నీళ్లు వచ్చేవన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గుద్దులే గుద్దులు…బాదుడే బాదుడు… కేసులే కేసులు అని విమర్శించారు. మూడు ముక్కల ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేశాడన్నారు. వెలుగొండ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పరదాలు కట్టుకుని వెలుగొండ ప్రాజెక్టు వద్దకి జగన్ వచ్చి వెళ్లాడని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌లో ముస్లిం బిల్లులు తీసుకు వస్తే.. జగన్ సపోర్ట్ చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అబ్దుల్ సలాంని వేధించడంతో.. ఆ కుటుంబ సభ్యులంతా ఆత్మాహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఉర్ధుని రెండో భాషగా మార్చింది తానేన్నారు. అలాగే హైదరాబాద్, కర్నూలులో సైతం ఉర్ధు యూనివర్శిటీలు ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ అయిదేళ్లలో మైనార్టీలకు ఒక్క పని అయినా చేశావా.. చెప్పాలంటూ మార్కాపురం వేదిక మీద నుంచి సీఎం వైయస్ జగన్‌కు సవాల్ విసిరారు. ప్రజలు గెలవాలంటే.. కూటమి గెలవాలన్నారు.

Read Also : Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్