AP : పేదవాళ్లు అంటే చంద్రబాబుకు నచ్చదు – బొత్స

జూన్ 9న విశాఖలో ఏపీ సీఎం గా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు

  • Written By:
  • Publish Date - May 24, 2024 / 09:11 PM IST

ఏపీలో ఎన్నికల ఫలితాల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది..మే 13 న 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 04 న వీటి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో ఫలితాలపై అధికార – ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరికీ వారు తమ ధీమా ను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత రెండు రోజుల పాటు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు…ఆ తర్వాత గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంతే కాదు జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు కూడా జరుపుతుండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. జూన్ 09 న వైజాగ్ లో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెపుతూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటికే జగన్ సీఎం కాబోతున్నారని చెప్పిన మంత్రి బొత్స … మరోసారి అలాంటి వ్యాఖ్యలే తెలిపాడు. ఏపీలో మరోసారి జగన్ నేతృత్వంలోని వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. జూన్ 9న విశాఖలో ఏపీ సీఎం గా రెండోసారి జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సారి విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో వైసీపీ గెలుస్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు ఫై కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. పేదవాళ్లు అంటే చంద్రబాబుకు నచ్చదని , ప్రతి విషయంలో చంద్రబాబు లేఖలు రాస్తూనే ఉన్నారని, ఎన్నికల సమయంలో అధికారులను బదిలీ చేసినచోటే అల్లర్లు జరిగాయని అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగసిన తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

Read Also : Bangles : మహిళలు మట్టి గాజులు వేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు తెలుసా?