Site icon HashtagU Telugu

Chandrababu Districts Tour : డిసెంబర్ 10 నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన..పూర్తి షెడ్యూల్ ఇదే

Chandrababu Districts Tour

Chandrababu Districts Tour

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu ) ఇక నుండి పూర్తి స్థాయిలో ప్రజల మధ్య ఉండబోతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో ఆరోపణలు ఎదురుకున్న బాబు..దాదాపు 52 రోజుల పాటు జైలు జీవితం గడిపి..ఈ మధ్యనే బెయిల్ ఫై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఇక నుండి ప్రజల్లో ఉండేందుకు డిసైడ్ అయ్యారు. ఈ మేరకు ఈ నెల 10 నుండి జిల్లాల పర్యటన చేసేందుకు రెడీ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న బాబు..శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. రేపు (ఆదివారం) సింహాచలం అప్పన్న స్వామిని, 5న శ్రీశైలం మల్లన్న, అనంతరం కడప దర్గా, గుణదల మేరీమాత ఆలయానికి వెళ్లనున్నారు. ఇలా ఈ నెల 09 వరకు దైవ దర్శనాలు చేసుకొని..ఇక 10 నుండి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.

ఈ సమావేశాలకు పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఆహ్వానించనున్నారు. ఒక్కో సమావేశానికి సుమారు 5 నుంచి 6 వేల మంది వరకూ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఓట్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై ఢిల్లీకి వెళ్లి సీఈసీని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. సీఎం జగన్, వైసీపీ నేతలు ఓటమి భయంతో దొంగ ఓట్లు చేరుస్తున్నారని, టీడీపీ సానుభాతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి 8 లోపు తనకు సమయం కేటాయించాలని సీఈసీకి ఆయన లేఖ రాయనున్నారు.

Read Also : Reverse Walking : వామ్మో.. రివర్స్ వాకింగ్ వల్ల ఏకంగా అన్ని ప్రయోజనాలా?