Site icon HashtagU Telugu

AP : చంద్రబాబు కస్టడీపై వాదనలు పూర్తి..రేపు తీర్పు

Chandrababu custody petition are complete Verdict tomorrow

Chandrababu custody petition are complete Verdict tomorrow

స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development) కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) కస్టడీని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై బుధవారం ఏసీబీ కోర్ట్ (ACB Court) లో వాడిగా, వేడిగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy), చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా (Sidharth Luthra) వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్ట్ రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తీర్పు వెలువరించనుంది.

రూ. 371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని , సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందని.. కస్టడీని అడ్డుకుంటున్నారని సీఐడీ తరుఫున పొన్నవోలు వాదించారు. అయితే చంద్రబాబు ను సిట్ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని చంద్రబాబు తరుపు లాయర్ సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు. మరి రేపు ఏసీబీ కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) కుంభకోణం కేసులో నిన్న(సెప్టెంబర్ 19) హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది, ఈ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. కోర్టు తీర్పును రేపటికి(సెప్టెంబర్ 21) పోస్ట్ పోన్ చేసింది. తనపై సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన పిటిషన్‌కు సంబంధించిన వాదనలు సుమారు నాలుగున్నర గంటల పాటు విన్నారు. రాష్ట్రం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్, అడ్వకేట్ రంజిత్ కుమార్, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ అడిషనల్ జనరల్ పి సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదించారు. చంద్రబాబుకు సంబంధించి రెండు పిటిషన్‌లపై తీర్పు రేపు రానుంది. ఈ తీర్పుల ఫై సర్వత్రా ఆసక్తి గా మారింది.

Read Also : Road Accident: బొల్తా కొట్టిన బస్సు, ఇద్దరు ప్రయాణికులు దుర్మరణం