Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన భార్య నారా భువనేశ్శరి(Bhuvaneshari)తో కలిసి ఈరోజు మహారాష్ట్ర (Maharashtra)లోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని(Kolhapur Sri Mahalakshmi Temple) సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు, నారా భువనేశ్వరి షిరిడీ పయనమయ్యారు. అక్కడ సాయినాథుడి దర్శనం చేసుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే చంద్రబాబు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి వెళ్లారు. అక్కడి నుంచి నిన్న రాత్రి ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
Read Also: Lanka Pay : ఇక నుంచి ‘లంక పే’.. టూరిస్టులకు గుడ్ న్యూస్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గతేడాది స్కిల్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు జైల్లో ఉన్న ఆయన, విడుదల అనంతరం తరచుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రాజకీయ కార్యకలాపాలతో ముమ్మరంగా గడిపిన చంద్రబాబు, పోలింగ్ పూర్తయ్యాక మళ్లీ పుణ్యక్షేత్రాల బాటపట్టారు.