Chandrababu : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఆగస్టు 15 స్వాత్రంత్య దినోత్సవం (Independence Day)సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొని.. దీని గురించి పోస్టు పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రత కాపాడడం మనందరి కర్తవ్యం. అందులో భాగంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం విస్తృత కార్యక్రమంగా మారడం ఆనందకర విషయం. మరీ ముఖ్యంగా మన తెలుగు… pic.twitter.com/ErU34cHBKW
— N Chandrababu Naidu (@ncbn) August 14, 2024
సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన సీఎం చంద్రబాబు.. మహోజ్వల చరిత గల మన దేశ సమగ్రతను కాపాడడం మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును అనుసరించి వరుసగా మూడో ఏడాది ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. ఇంటింటా జాతీయ జెండా అనే ఈ కార్యక్రమం మరింత విస్తరించడం సంతోషంగా ఉందనరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చెప్పారు. మరీ ముఖ్యంగా… మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం జాతీయ జెండా రూపంలో ప్రతి ఇంటిపై ఎగరడం మనకు మరింత ప్రత్యేకమని చెప్పారు. పంద్రాగస్టున ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయాలని.. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు.. జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీలలో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కల్పిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.