Site icon HashtagU Telugu

AP Assembly Sessions : జగన్ ఒక్క ఛాన్స్ అని రాష్ట్రాన్ని నాశనం చేసాడు – సీఎం చంద్రబాబు

Cbn Speech

Cbn Speech

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions) నాల్గవ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముుందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం వార్షిక బడ్జెట్‌పై చివరి రోజు చర్చ జరిగింది. ఏపీలో ఐదేళ్ల పాటు పాలన కొనసాగించిన వైసీపీపై సీఎం చంద్రబాబు (Chandrababu) కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని, తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్లైన్లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. భూమి ఉంది కాబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అందుకే అమరావతి కోసం భారీగా భూమి కావాలనుకున్నామని వివరించారు.

వైసీపీ హయాంలో సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదని , రూ.431 కోట్ల ప్రజాధనంతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారని, దాన్ని చూస్తే తనకే కళ్లు తిరుగుతున్నాయని అన్నారు. ‘రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేసుకున్నారు. సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేసి ఉంటే రోడ్లు బాగయ్యేవి’ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేశాం. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర. మోదీ, పవన్, నాపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం, గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసినప్పుడు అనేక విధానాలు తీసుకువచ్చాం. రాష్ట్ర విభజన సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాం.

2014లో మనకు లోటు కరెంట్ ఉండేది. అనేక విధానాలు తీసుకువచ్చి మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చాం, అనేక విధానాలు తీసుకువచ్చి మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చాం, రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. మేం ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది.. ఫలితాలు చూసేవాళ్లం ,ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేం ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వం జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదు. గత ప్రభుత్వం కాగ్ కు కూడా నివేదికలు ఇవ్వలేదు. విభజన నష్టం కంటే గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగింది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పారిపోయేందుకు సిద్ధంగా లేనని చెప్పా . అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజల కోసమే పనిచేశాం. ఇప్పుడు భావితరాలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు. వాళ్ల దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను కూడా నాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి. స్కాముల కోసమే స్కీములు అమలు చేశారు.అమరావతి గొప్ప నగరంగా తయారుకాకుండా ఐదేళ్లు అడ్డుకున్నారు.

రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని దెబ్బతీశారు, నదుల అనుసంధానం పూర్తయితే రాష్ట్రంలో కరవు అనేదే ఉండదు . పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోతే రెండేళ్లపాటు పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయాం. తప్పుడు విధానాలతో విద్యుత్ కొన్నారు.. ఆ సంస్థలను నష్టాల్లోకి నెట్టారు. గ్రామాల్లో ఉచితంగా లభించే ఇసుకపై వ్యాపారం చేసుకున్నారు. మద్యంపైనా ఇంతలా అవినీతి చేస్తారని మేం ఊహించలేదు. చెత్తపైనా పన్ను వేసి ప్రజలను అనేక ఇబ్బందులు పెట్టారు. ఐదేళ్లపాటు హింసా రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టారు. ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు అనేక పనులు చేశారు. ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు అనేక పనులు చేశారు – గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించింది – ప్రజలు విశ్వసించే ఓటేస్తే..దుర్మార్గంగా ప్రవర్తించారు. గత ప్రభుత్వం సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారు. రూ.431 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు . రుషికొండ ప్యాలెసను చూస్తే నాకే కళ్లు తిరుగుతున్నాయి. ప్రజాధనంతో ఇంత పెద్ద ప్యాలెస్‌ను కడతారా? పర్యావరణాన్ని విధ్వంసం చేసి రుషికొండ ప్యాలెస్ కట్టారు – రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారు – సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు – రూ.500 కోట్లు ఖర్చు పెట్టుంటే రోడ్లు బాగుయ్యేవి – కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారు – ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించం – అవినీతి, అక్రమాలు చేసేందుకు కొందరు రాజకీయాల్లోకి వచ్చారు – టీడీపీ స్థాపించి 45 ఏళ్లు అయ్యింది.. మాకే పేపర్, టీవీ లేవు – మద్యంపై రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చారు – గత ప్రభుత్వం అన్ని రంగాలను సర్వనాశనం చేసింది – ఇప్పటివరకు రూ.9,74,556 లక్షల కోట్ల అప్పు తేలింది – గత ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టాం – ఇసుకను మేం ఉచితంగా ఇస్తే.. గత ప్రభుత్వం టన్ను రూ.475కు విక్రయించింది – మా హయాంలో వ్యవసాయంలో 16.06 శాతం వృద్ధిరేటు నమోదైంది – గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయంలో వృద్ధిరేటు 10.05 శాతానికి తగ్గింది – గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు పెట్టుబడులు రాలేదు – గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు వెళ్లాయి – గత ప్రభుత్వం నిర్వాకం వల్ల అధికారులు జైలుకెళ్లారు – గత ప్రభుత్వం ఆస్తులు తాకట్టుపెట్టి అప్పులు తెచ్చింది – ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తున్నాం – మేం అధికారంలోకి వచ్చే సరికి రాష్ట్రం వెంటిలేటర్పై ఉంది – ప్రజలు ఇచ్చిన గెలుపు వల్ల ఢిల్లీలో మన పరపతి పెరిగింది – నా దగ్గర డబ్బుల్లేవు.. నూతన ఆలోచనలు ఉన్నాయి – నూతన ఆలోచనలతో సంపద సృష్టిద్దాం.. పేదలకు పంచుదాం – సంవత్సరానికి రూ.33 వేల కోట్ల పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ – ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం – 64.50 లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం – ఆడబిడ్డల భద్రతకు భరోసా ఇస్తాం – రాజకీయ ముసుగులో నేరాలు చేయాలని చూస్తే ఉపేక్షించం – రాబోయే రెండేళ్లలో పోలవరం పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నాం – రోడ్లపై గుంతలు ఏర్పడినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు – రూ.850 కోట్లతో గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం – 4 పారిశ్రామికవాడల కోసం రూ.10 వేల కోట్ల ఖర్చు చేస్తున్నాం – సంపదను సృష్టిస్తాం.. ఆదాయాన్ని పెంచుతాం – పెంచిన ఆదాయాన్ని పేదల సాధికారత కోసం ఖర్చు చేస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇక ఎడ్యుకేషన్‌ (Education)కు సంబంధించి మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. టీచింగ్‌ను బలోపేతం చేసిన విద్యార్ధులను ఎస్సెస్ చేసి కొందరికి ఫోకస్‌గా చదువు చెపుతున్నామన్నారు. ఈ ఏడాది10 శాతం ఎడ్మిషన్లు పెరిగాయన్నారు. నారాయణ కాలేజీలతో పోటీ పడేలా ఇంటర్ కాలేజీలు నడుపుతామని చెప్పారు. 9 వ తరగతి నుంచి ఇంటర్ కోసం ఓరియంటేషన్ ట్రైనింగ్ చేయాలని చెప్పారు. స్కూల్‌లకు ర్యాంకింగ్ మెకానిజం పెడదామని భావిస్తున్నామని, డిసెంబర్ మొదటి వరంలో పిటీఎం నిర్వహిస్తున్నామని.. సభ్యులు కూడా పాల్గొనాలని మంత్రి లోకేష్ అన్నారు.

Read Also : Balakrishna- Thaman : బాలకృష్ణ చిన్నపిల్లాడు అంటూ తమన్ కామెంట్స్