Chandrababu : శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు.. ఏపీ ప్రజలు జగనాసురవధ చేయాలి

కొనకళ్ల, వేదవ్యాస్ వంటి వారికి అవకాశం కల్పించ లేకపోయామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

  • Written By:
  • Publish Date - April 17, 2024 / 10:12 PM IST

కొనకళ్ల, వేదవ్యాస్ వంటి వారికి అవకాశం కల్పించ లేకపోయామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారంలోకి రాగానే వీరిద్దరిని గౌరవిస్తామన్నారు. శ్రీరాముడు రావణాసుర వధ చేశాడు.. ఏపీ ప్రజలు జగనాసురవధ చేయాలన్నారు. అన్ని వర్గాలను నట్టెట్లో ముంచేసిన వ్యక్తి సైకో జగన్ అని ఆయన అన్నారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి.. బాలసౌరీ, కృష్ణ ప్రసాద్ గెలుపు తధ్యమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఇన్నాళ్లూ పరదాలు కట్టుకుని తిరిగాడని, ఇప్పుడు బుగ్గలు నిమిరుతున్నాడు.. ముద్దులు పెడుతూ మళ్లీ బయలుదేరాడని, బాబాయ్ హత్య చేశాడు.. కోడికత్తి డ్రామా ఆడారన్నారు. ఇప్పుడు మళ్లీ గులకరాయి డ్రామా ఆడుతున్నారని, సభకు వస్తే ఇస్తానన్న డబ్బులివ్వలేదని రాయి విసిరానని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తన మీద రాయి వేస్తే రాష్ట్రం మీద రాయి వేసినట్టేనట అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

We’re now on WhatsApp. Click to Join.

అమర్నాధ్ గౌడ్ అనే బాలుడిని పెట్రోల్ పోసి తగులపెడితే రాష్ట్రాన్ని తగుల పెట్టినట్టు కాదా..? అని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పవన్ అడిగారని, మా మీద వేసిన రాళ్లు దొరికాయి.. కానీ జగన్ మీద వేసిన గులక రాళ్లు దొరకలేదని, మావి మూడు జెండాలు కానీ.. ఏజెండా ఒక్కటే అన్నారు చంద్రబాబు. మేం ముగ్గురం కలిసి వస్తున్నాం.. జగన్ శవాలతో వస్తున్నాడని, 2014 ఎన్నికల్లో తండ్రి మరణం, 2019లో బాబాయి హత్యతో వచ్చాడన్నారు, ఇప్పుడు వృద్ధుల శవాలతో ఎన్నికలకు వస్తున్నాడని, విధ్వంసం, అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేశాడని, 2019లో మేం గెలిచి ఉంటే.. కృష్ణాలో నీటి సమస్యే ఉండేది కాదన్నారు. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచేశాడని, అమరావతిని నాశనం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. బందరు పోర్టు, అమరావతి వస్తే పెడన ఇంకా అభివృద్ధి అవుతుందని, టీడీపీ ఇచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారన్నారు. జగన్ అమలు చేసేవి నవరత్నాలు కావు.. నకిలీ రత్నాలు అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధం చేశాడా..? ప్రత్యేక హోదా తెచ్చాడా..? ప్రజలతో నాసిరకం మద్యం తాగిస్తూ.. జే-గన్ ప్రజల రక్తాన్ని తాగుతున్నాడని, వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందన్నారు చంద్రబాబు. పోలీసులను జగన్ తన బానిసలని అనుకుంటున్నాడని, బటన్ నొక్కడం తప్ప జగనుకేం తెలియదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బటన్ నొక్కడానికి జగన్ ఎందుకు..? ఇంట్లో ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని, సంపద సృష్టికి తెలివి కావాలని చంద్రబాబు సెటైర్లు వేశారు.
Read Also : MP Bharath : ప్రజలు పేదలుగా ఉండాలని జగన్ కోరుకుంటున్నారు..!