CBN : జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది.. పులివెందుల్లో కూడా టీడీపీనే – చంద్రబాబు

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 08:07 PM IST

ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.“ ‘రా…కదలిరా’ అని పిలుపిస్తే కమలాపురం కాలుదువ్విందని.. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోందని తెలిపారు. కమలాపురం సభకు వచ్చిన జనమంతా తాను చేస్తున్న పోరాటం త‌న‌ స్వార్థం కోసం కాదని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలోని యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సంతోషం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని..మీ సహకారం లేకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం త‌న‌ ఒక్కడి చేతుల్లో ఉండదన్నారు..

2019లో కడపలో అన్నిసీట్లలో వైసీపీనే గెలిపించారని.. అప్పటినుంచి ఇప్పటివరకు ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? అని ప్ర‌శ్నించారు. కమలాపురంలోనే ఈ స్థాయిలో స్పందన ఉంటే, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయమ‌ని చంద్ర‌బాబు జోస్యం చెప్పారు ఇన్నిసార్లు గెలిపించాం.. మాకు ఏం ఒరగబెట్టావని జగన్ రెడ్డిని కడపవాసులే నిలదీస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు. పులివెందుల ప్రజలు ఇలాంటివాడినా తాము గెలిపించింది అని బాధపడుతున్నారని చంద్ర‌బాబు తెలిపారు. కడపజిల్లాలో కరువు వచ్చి, 35 మండలాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయని.. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం జిల్లాలో ఎప్పుడూ నమోదు కాలేదన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హూ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్లూ? ఈ స్టోరీ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపిస్తుందన్నారు. మలుపుల మీద మలుపులు.. సస్పెన్సన్స్ ల మీద సస్పెన్స్ లు. వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ సాక్షిలో తప్పుడు ప్రచారం చేశారని.. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. తనకు తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ రెడ్డికి నేడు వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? అని ప్ర‌శ్నించారు.నాడు సీబీఐ కావాలని కోర్టుకెళ్లారని.. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారని చంద్ర‌బాబు అన్నారు. అసలు వివేకా హత్యపై మాట్లొద్దంటూ గ్యాగ్ ఆర్దర్ తెచ్చారని.. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ చెప్పారని గుర్తు చేశారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారని.. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడ‌న్నారు. బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడని.. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారని చంద్ర‌బాబు అన్నారు.

Also Read:  CM Revanth: తెలంగాణ అంతటా పారిశ్రామిక వృద్ధికి మెగా మాస్టర్ పాలసీ: సీఎం రేవంత్