CBN : వైఎస్ వివేకా హత్య హాలీవుడ్ ను మించిన స్టోరీ : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

వైసీపీ మునిగిపోయే నావ అని, దాన్ని ఎవరూ కాపాడలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీలోనే

  • Written By:
  • Publish Date - December 30, 2023 / 10:36 PM IST

వైసీపీ మునిగిపోయే నావ అని, దాన్ని ఎవరూ కాపాడలేరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీలోనే తిరుగుబాటు మొదలైందని.. వాళ్ల ఎమ్మెల్యేలే పుట్టకొకడు బ‌య‌టికి వెళ్తున్నారన్నారన్నారు. నాలుగున్నరేళ్లుగా జగన్ అందరినీ ఏడిపించాడని.. ఇప్పుడు జగన్ వంతు వచ్చిందన్నారు. త‌న కోసం కాకుండా మీ భవిష్యత్తు కోసం ఇంటికొకరు జండాపట్టుకుని బయటకు రావాలని, అడ్డుకున్నవారికి అదే జండాతో బడితపూజ చేయండని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. మూడు రోజు పర్యటనలో భాగంగా కుప్పం, మల్లనూరులో పర్యటించారు. కుప్పంలోని అన్నా క్యాంటీన్ ను సందర్శించి భోజన వితరణ చేశారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, తరువాత పెద్దపులి గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం కుప్పం, మల్లనూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ జండా తప్ప మరో జెండా తెలియని వాళ్లు కుప్పం ప్రజలన్నారు. మా భవిష్యత్తుకు మీరే గ్యారంటీ అంటూ పిల్లలు, యువత, ఆడబిడ్డలు కోరుతున్నారని… కుప్పంలో జరిగిన అభివృద్ధి టీడీపీ తప్ప.. మరొక పార్టీ చేయలేదన్నారు. చెత్త సేకరించడానికి కంపోస్ట్ తయారు చేసే షెడ్లు కడితే..వీళ్లు వచ్చి వాటికి రంగులు వేసుకుంటున్నారని మండిప‌డ్డారు. ఇక్కడ రైతులు, యువత, ఆడబిడ్డలు, చిరువ్యాపారులు ఉన్నారని.. ఈ ఐదేళ్లలో మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా.? అని వారిని అడిగారు. ఆసుపత్రుల్లో రోగులకు అన్నం పెట్టే పరిస్థితి కూడా ఈరోజు లేదని.. ఇలాంటి దద్దమ్మ సీఎంను ఎప్పుడూ తాను చూడలేదన్నారు జ‌గ‌న్ బాబాయి వివేకా హత్య జరిగి ఐదేళ్లు అయిందని.. ఇలాంటి హత్య టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా జరగలేదన్నారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి హత్య జరిగిన‌ప్పుడు వెంటనే గుండెపోటు అన్నార‌ని.. అదే వార్త‌ను సాక్షిలో కూడా వేసుకున్నార‌ని తెల‌పారు మళ్లీ తర్వాత రక్తపు వాంతులు చేసుకుని చనిపోయాడని అంటున్నారని… తలపగిలి అనుమానం వచ్చిందని అన్న తర్వాత హత్య అని చెప్పారని చంద్ర‌బాబు తెలిపారు. గొడ్డలి పోటు అని బయటకు వచ్చాక నారాసుర రక్త చరిత్ర అని త‌న‌ మీద నింద వేశారన్నారు.

Also Read:  HCA : ఈడెన్ గార్డెన్స్‌ను సంద‌ర్శించిన హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్‌రావు.. అధునాత‌న క్రికెట్ మైదానాల‌పై అధ్యాయ‌నం