Chandrababu CM : ఏపీలో అధికారం టీడీపీదే.! ఆత్మ‌సాక్షి లేటెస్ట్ స‌ర్వే వెల్ల‌డి!!

Chandrababu CM : వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే లేటెస్ట్ గా తేల్చేసింది.

  • Written By:
  • Updated On - October 3, 2023 / 03:32 PM IST

Chandrababu CM : వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే లేటెస్ట్ గా తేల్చేసింది. సింగిల్ గా పోటీచేసినా, పొత్తుల‌తో వెళ్లినా అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంచ‌నా వేసింది. అయితే, బీజేపీతో కలిసి ఎన్నిక‌ల‌కు వెళితే మాత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌రోఛాన్స్ ఉంటుంద‌ని చెబుతోంది. మాజీ సీఎం చంద్ర‌బాబు జైలుకు వెళ్లిన త‌రువాత చేసిన ఈ స‌ర్వే స్ప‌ష్టంగా టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింది. తిరుగులేని మోజార్టీతో అధికారంలోకి రావాలంటే, టీడీపీ+జ‌న‌సేన‌+ఉభ‌య క‌మ్యూనిస్ట్ ల కూట‌మి బెస్ట్ గా తేల్చింది.

టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆత్మ‌సాక్షి స‌ర్వే లేటెస్ట్ గా (Chandrababu CM)

వేర్వేరుగా ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తే టీడీపీ 44శాతం ఓటు బ్యాంకుతో 86 స్థానాలను గెలుచుకుంటుంద‌ని అంచ‌నా వేసింది. నువ్వా? నేనా? అన్న‌ట్టు పోటీ ఉండే 15 స్థానాల్లో 6 టీడీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని తేల్చింది. అంటే. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి అవస‌ర‌మైన మ్యాజిక్ ఫిగ‌ర్ 88 సాధించ‌నుంది. అదే, టీడీపీ+జ‌న‌సేన కూట‌మిగా వెళితే, 50శాతం ఓటు బ్యాంకుతో 95+13=108 స్థానాల‌ను గెలుచుకోనుంది. అంటే తిరుగులేని మోజార్టీతో అధికారంలోకి టీడీపీ, జ‌న‌సేన కూట‌మి వ‌స్తుంద‌నిత తేల్చేసింది. ఇక టీడీపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్ట్ పార్టీలు కూట‌మిగా ఎన్నిక‌ల‌కు వెళితే ఆ కూట‌మి 54శాతం ఓటు బ్యాంకుతో 115 నుంచి 122 స్థానాల్లో గెలిచే అవ‌కాశం ఉంది. ఒక వేళ బీజేపీతో క‌లిసి టీడీపీ, జ‌న‌సేన కూట‌మిగా వెళితే మాత్రం 43శాతం ఓటు బ్యాంకుకు ఆ కూట‌మి ప‌రిమితం కానుంది. అంటే, కేవ‌లం 70 నుంచి 75 స్థానాలు మాత్రం గెలుచుకోవ‌డానికి ఆ కూట‌మికి ఛాన్స్ ఉంద‌ని తేల్చేంది. అప్పుడు వైసీపీ 98 నుంచి 100 స్థానాల‌ను గెలుచుకుని మ‌రోసారి అధికారంలోకి (Chandrababu CM) వ‌స్తుంద‌ని అంచ‌నా వేసింది.

బీజేపీతో క‌లిసి వెళితే మాత్రం అధికారాన్ని చేజార్చుకునే

తాజా స‌ర్వే ప్ర‌కారం నాలుగు ఆప్ష‌న్ల‌లో మూడు ఆప్ష‌న్లు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. పొర‌బాటును బీజేపీతో క‌లిసి వెళితే మాత్రం అధికారాన్ని చేజార్చుకునే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వే సారాంశం. ఒంట‌రిగా వెళ్లిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు సీఎం కావ‌డానికి అవ‌కాశం ఉంద‌ని తేల్చింది. నాలుగు ఆప్ష‌న్ల‌లో తొలి ఆప్ష‌న్ ప్ర‌కారం ఏ పార్టీకి ఆ పార్టీ ఎన్నిక‌ల‌కు వెళితే టీడీపీ 44శాతం, వైసీపీ 41.5శాతం, జ‌న‌సేన 10శాతం, బీజేపీ 0.5శాతం, ఇత‌రులు 3శాతం, సైలెంట్ ఓటు 1శాతంగా ఉంది. అప్పుడు టీడీపీ86, వైసీపీ 68, జ‌న‌సేన 6 గెలుచుకునే అవ‌కాశం ఉంది. మిగిలిన 15 చోట్ల నువ్వా ? నేనా? అనేలా పోటీ ఉండ‌నుంది. వాటిలోనూ 6 టీడీపీ, 9 వైసీపీకి అనుకూలంగా ఉన్నాయ‌ని స‌ర్వే అంచ‌నా వేసింది. అంటే, మ్యాజిక్ ఫిగ‌ర్ చేరుకోవ‌డానికి టీడీపీకి (Chandrababu CM)అనుకూలంగా ఆంద‌న్న‌మాట‌.

టీడీపీ, జ‌న‌సేన పొత్తు

ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన పొత్తు కుదిరింది. ఆ పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళితే, 50శాతం ఓటును ఆ రెండు పార్టీలు పొందితే, 43శాతం వైసీపీ, బీజేపీ 0.5శాతం, ఇత‌రులు 4.5శాతం, సైలెంట్ ఓటు 2శాతంగా అంచ‌నా వేసింది. అప్పుడు సీట్ల రూపంలో టీడీపీ, జ‌న‌సేన‌కు 108, వైసీపీ 60, నువ్వా ? నేనా? అన్న‌ట్టు 7 స్థానాల్లో ఉంటుంది. ఆ ఏడులోనూ టీడీపీ 5, వైసీపీ 2 స్థానాల్లోనూ అనుకూలంగా ఉన్నాయి. అంటే, టీడీపీ, జ‌నసేన 108 నుంచి 113 స్థానాల్లో గెలిచే  (Chandrababu CM) అవ‌కాశం ఉంది.

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి

ఇటీవ‌ల పొత్తు ప్ర‌క‌టించిన త‌రువాత ప‌వ‌న్ చెప్పిన‌ట్టు బీజేపీ క‌లిసి వ‌స్తే మాత్రం టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మికి 43శాతం, వైసీపీ 47శాతం, ఇత‌రులు 5శాతం, సైలెంట్ ఓటు 5శాతంగా ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. సీట్ల ప్ర‌కారం మూడు పార్టీల కూట‌మికి 70 నుంచి 75 వ‌స్తాయ‌ని స‌ర్వే చెబుతోంది. అప్పుడు వైసీపీకి 98 నుంచి 100 స్థానాలు వస్తాయ‌ని, ఏడు స్థానాల్లో పోటీ గ‌ట్టిగా ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. పైగా మూడు పార్టీల పొత్తును 53శాతం వ్య‌తిరేకిస్తున్నార‌ని చెబుతోంది. ఒక వేళ మూడు పార్టీలు బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన‌ పొత్తు ఉంటే మాత్రం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌రో ఛాన్స్ కు మార్గం సుగ‌మం అయిన‌ట్టేన‌ని స‌ర్వే సారాంశం.

టీడీపీ, జ‌న‌సేన‌, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు కూట‌మిగా (Chandrababu CM)

నాలుగో ఆప్ష‌న్ కింద టీడీపీ, జ‌న‌సేన‌, ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు కూట‌మిగా ఏర్ప‌డితే తిరుగులేకుండా ప్ర‌భుత్వాన్ని  (Chandrababu CM) ఏర్పాటు చేస్తాయ‌ని తేల్చేసింది. అప్పుడు ఆ కూటమికి 54శాతం ఓటు బ్యాంకు వ‌స్తుంద‌ని చెబుతోంది. వైసీపీకి కేవ‌లం 43శాతం ఓటు బ్యాంకు సాధిస్తుంద‌ని అంచ‌నా వేసింది. ఇత‌రులు 0.75, సైలెంట్ ఓటు 2.25శాతం ఉంటుంద‌ని చెబుతోంది. స్థానాల రూపంలో ఈశాతాన్ని తీసుకుంటే కూట‌మి 115 నుంచి 122 వ‌ర‌కు గెలుచుకునే అవకాశం ఉంది. అప్పుడు వైసీపీ కేవ‌లం 56 నుంచి 58 స్థానాల‌కు పరిమితం కానుంది. ఈ కూట‌మికి 54శాతం మంది ఓట‌ర్లు మ‌ద్ధ‌తుగా నిలిచారు.

Also Read : TDP Josh : తొలి విడ‌త భువ‌నేశ్వ‌రి, మ‌లివిడ‌త బ్రాహ్మణి `బ‌స్సు యాత్ర`

మొత్తం మీద బీజేపీతో దూరంగా ఉంటేనే టీడీపీకి మంచిద‌ని స‌ర్వే తేల్చేసింది. పొర‌బాటును బీజేపీతో చేతులు క‌లిపితే మ‌రోఛాన్స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి వెళుతుంద‌ని ఆ స‌ర్వే సారంశం. నాలుగు ఆప్ష‌న్ల‌లో మిగిలిన మూడు ఆప్ష‌న్ల‌లో దేనికి వెళ్లినా ప్ర‌భుత్వాన్ని చంద్ర‌బాబు ఏర్పాటు చేస్తారు. టీడీపీ గాలి ఏపీలో క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. పైగా చంద్ర‌బాబును జైలుకు పంపించిన త‌రువాత సానుభూతి పెరుగుతోందని స‌ర్వే తేల్చేసింది. ఆయ‌న్ను జైలుకు పంప‌డాన్ని 53శాతం మంది వ్య‌తిరేకిస్తున్నారు. కేవ‌లం 18శాతం మంది మాత్ర‌మే స‌మ‌ర్థిస్తున్నారు. అంటే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌యంకృతాప‌రాధం చేశార‌ని ఆ స‌ర్వే చెబుతోంది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు బీజేపీ గురించి ఆలోచించ‌కుండా ఎన్నిక‌ల‌కు వెళితే అధికారం ఖాయంగా ఆత్మ‌సాక్షి స‌ర్వే చెబుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆ స‌ర్వే సంస్థ చెప్పిన అంచ‌నాలు నిజ‌మ‌య్యాయి. అంతేకాదు, ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆ సంస్థ చెప్పిన ఫ‌లితాలు ఇంచుమించుగా వ‌చ్చాయి. సో..చంద్ర‌బాబు సీఎం కావ‌డానికి ఏపీ ఓట‌ర్లు సానుకూలంగా ఉన్నార‌ని స‌ర్వే చెబుతోంది.

Also Read : CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక‌?, `పోచారం` రియాక్ష‌న్ తో అప్ర‌మ‌త్తం!