Site icon HashtagU Telugu

TDP-BJP Alliance: టీడీపీ ఎన్డీయే పొత్తుపై బాబు క్లారిటీ

TDP-BJP Alliance

New Web Story Copy (6)

TDP-BJP Alliance: ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీని ఢీకొట్టేందుకు జనసేన టీడీపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అయితే బీజేపీ టీడీపీ ఫై క్లారిటీ లేదు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్డీయేతో టీడీపీ పొత్తు అంశం తెరపైకి వచ్చింది. ఆగస్టు 15న చంద్రబాబు విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ సమయంలో టీడీపీ ఎన్డీయే పొత్తు అంశంపై మీడియా ప్రశ్నించింది. దీనిపై చంద్రబబు మాట్లాడుతూ.. ‘ఇది సరైన సమయం కాదు’ అని చంద్రబాబు అన్నారు. సరైన సమయంలో దీనిపై మాట్లాడతాను అని చెప్పారు.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..2024 జాతీయ రాజకీయాల్లో తన పాత్ర చాలా స్పష్టంగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు. అయితే నా ప్రాధాన్యత మాత్రం ఆంధ్రప్రదేశ్ కేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణమని, పునర్నిర్మాణానికి కట్టుబడి ఉంటానని చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం బీచ్ రోడ్డులోని మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు.

Also Read: TTD : చేతిలో కర్ర ఉంటె పులి దాడి చేయదా..? టీటీడీ నిర్ణయం ఎంత వరకు కరెక్ట్..?