Chandrababu Clarity on Central Govt Releases Rs. 3300 Cr : భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం (Central Govt ) భారీ సాయం చేసిందని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు (తెలుగు States) కలిపి రూ.3,300కోట్ల నిధులు విడుదల చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం ప్రచారం జరుగుతుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పందించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని చంద్రబాబు స్పష్టం చేసారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని చంద్రబాబు తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 72% పారిశుద్ధ్య పనులు పూర్తి
బాధితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు. బీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో 72% పారిశుద్ధ్య పనులు పూర్తయ్యాయని చంద్రబాబు వెల్లడించారు. మనుషులు వెళ్లలేని చోట్ల డ్రోన్లతో బాధితులకు ఫుడ్ అందించామన్నారు. Al, ఊబరైజేషన్ టెక్నాలజీ ఉపయోగించామని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి సరకులు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు.
వరద బాధితుల సహాయార్థం కోట్లలో విరాళాలు
ఇదిలా ఉంటె సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం విరాళాలివ్వడానికి సంస్థలు, వ్యక్తులు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. తాజాగా సీఎంఆర్ఎఫ్కు విరాళాలు ఇచ్చిన వారి వివరాలు : కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు, జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ రూ. 5 కోట్లు, శ్రీ చైతన్య, శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ. 2 కోట్లు, విట్ ఛాన్స్లర్ డా.విశ్వనాథమ్ రూ. కోటి 57 లక్షల 50 వేలు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కోటి రూపాయలు, రవికుమార్ రెడ్డి, బపేశ్వరరావు(సుజలాన్ & యాక్సిస్ ఎనర్జీ) కోటి రూపాయలు, సీఎం రాజేష్, సీఎం రిత్విక్ కోటి రూపాయలు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు, రూ. 50 లక్షలు, పి.చంద్రశేఖర్ రావు, శైలేష్, రాజా రూ. 50 లక్షలు, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షలు, కోటం సంధ్య రూ. 5 లక్షలు , సిశ్వాన్ ఇన్ ఫ్రా రూ. 5 లక్షలు అందించారు.
Read Also : Telangana New PCC Chief : తెలంగాణ కొత్త పీసీసీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఆయన్నే ఎంపిక చేయడానికి కారణం ఏంటి..?