Chandrababu Custody : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వబోతున్నట్లు తెలిపింది

Published By: HashtagU Telugu Desk
chandrababu-cid-custody-petition-acb-court-verdict-postponed-to-september-22nd

chandrababu-cid-custody-petition-acb-court-verdict-postponed-to-september-22nd

చంద్రబాబు (Chandrababu ) కేసుల విషయంలో టీడీపీ శ్రేణుల్లో నిరాశ..ఉత్కంఠ నెలకొంటూనే ఉంది. ఏ కేసు విషయంలో ఏ తీర్పు రావడం లేదు. వైసీపీ ప్రభుత్వం (YCP GOVT) పెట్టిన పలు కేసుల విషయంలో చంద్రబాబు లాయర్లు హైకోర్టు , ఏసీబీ కోర్ట్ లలో వాదనలు వినిపించడం..కోర్ట్ వాయిదా లు వేయడం కొనసాగుతూనే ఉంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development Case) కేసులో తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వబోతున్నట్లు తెలిపింది. చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉండటతో దీన్ని వాయిదా వేశారు. ఒకవేళ హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్టయితే తీర్పును వాయిదా వేస్తామని, లిస్ట్ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.

ఈ కేసులో ఇరువర్గాల న్యాయవాదుల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది. తీర్పును గురువారం వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు (ACB Court) ప్రకటించింది. ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు ఈ తీర్పును వెల్లడించనున్నట్టుగా అంత భావించారు. కానీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సీఐడీ కస్టడీ (Chandrababu Custody) పిటిషన్ పై తీర్పును వెల్లడిస్తారని తెలిపారు. దీంతో సాయంత్రం నాలుగు గంటలకు ఏసీబీ కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదులు వచ్చారు. ఐదు గంటల సమయంలో బెంచ్ పైకి వచ్చిన న్యాయమూర్తి ఏపీ హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్ తీర్పు గురించి ఆరా తీశారు. ఈ విషయమై ఇరువర్గాల న్యాయవాదులు చంద్రబాబు రిమాండ్ రివ్యూ పిటిషన్ పై వివరాలను ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి వివరించారు. ఈ తరుణంలో ఈ కేసుతో సంబంధం లేని వారంతా కోర్టు హాల్ నుండి బయటకు వెళ్లాలని జడ్జి సూచించారు. ఈ నెల 22న చంద్రబాబు కస్టడీపై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును వెల్లడించనున్నట్టుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది.

Read Also : World Cup Trophy: చార్మినార్ ఎదుట ప్రపంచకప్ ట్రోఫీ సందర్శన

  Last Updated: 21 Sep 2023, 06:29 PM IST