Site icon HashtagU Telugu

chandrababu : అఖిల‌ప్రియ కు వార్నింగ్‌, ఏవీ వైపు చంద్ర‌బాబు

Chandrababu

Chandrababu

రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూప్ ల‌ను సెట్ చేస్తూ చంద్ర‌బాబునాయుడు(chandrababu) కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నారు. ప్ర‌తి వారం ఒక్కో జిల్లాకు `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` కార్య‌క్ర‌మానికి వెళుతూ అసంతృప్తుల‌ను చ‌ల్లార్చ‌తూ ఐక్యంగా ప‌నిచేయాల‌ని సూచిస్తున్నారు. క‌ర్నూలు జిల్లాలోనూ సెట్ చేశారు. కానీ, అక‌స్మాత్తుగా మాజీ మంత్రి అఖిల‌ప్రియ(Akhilapriya) వాల‌కం చంద్ర‌బాబుకు ఆగ్ర‌హం క‌లిగించింది. యువ‌గ‌ళం సంద‌ర్భంగా ఏవీ సుబ్బారెడ్డి,(AV subbareddy) అఖిల‌ప్రియ‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ తెలుగుదేశం పార్టీకి న‌ష్టం జ‌రిగేలా ఉందని వార్నింగ్ ఇచ్చారు. లేదంటే చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని మాజీ మంత్రి అఖిల‌ప్రియ‌కు తేల్చి చెప్పారు.

ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూప్ ల‌ను సెట్ చేస్తూ చంద్ర‌బాబునాయుడు(chandrababu)

భూమా నాగిరెడ్డి, శోభ మ‌ర‌ణించిన త‌రువాత నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ మీద ప‌ట్టుకోల్పోతున్నారు. ఆ కుటుంబం తొలి నుంచి టీడీపీలో (chandrababu)ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జారాజ్యం పార్టీకి వెళ్లారు. ఆ త‌రువాత వైఎస్ ఆప‌రేష‌న్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. ఆ త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతూ వార‌స‌త్వాన్ని భూమా అఖిల‌ప్రియ‌కు ఆళ్ల‌గ‌డ్డ ప్ర‌జ‌లు అప్ప‌గించారు. సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆమె టీడీపీలోకి మంత్రిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సంద‌ర్భంగా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కీల‌క భూమికిను పోషించారు. అక్క‌డ టీడీపీ గెలవ‌డంతో భూమా అఖిల‌ప్రియ(Akhilapriya) హ‌వా కొన‌సాగింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో పాటు ఆమె కూడా ఓడిపోయారు. దీంతో రాజ‌కీయాల‌కు దాదాపుగా కొంత కాలం పాటు దూరంగా ఉన్నారు. హైద‌రాబాద్ లోని ఆస్తుల‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నంలో ప‌లు కేసుల్లో ఉన్నారు.

ఏవీ సుబ్బారెడ్డికి ప్రాముఖ్య‌త‌నిస్తూ చంద్ర‌బాబు సంకేతాలు

హైద‌రాబాద్ లోని ఆస్తుల‌ను కాపాడుకోవ‌డానికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy)ని ఒకానొక సంద‌ర్భంలో ఆశ్ర‌యించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆమె వైసీపీ గూటికి మ‌ళ్లీ చేర‌తార‌ని అనుకున్నారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో నిమ్మ‌కుండిపోయారు. టీడీపీ త‌ర‌పున ప‌నిచేయ‌డం గ‌త ఏడాది నుంచి స్పీడ్ పెంచారు. స్వ‌ప‌క్షంలోనే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఏవీ సుబ్బారెడ్డిని భావిస్తూ ఆమె టార్గెట్ చేశారు. కానీ, నంద్యాల నుంచి ఏవీ సుబ్బారెడ్డికి ప్రాముఖ్య‌త‌నిస్తూ చంద్ర‌బాబు(chandrababu) ఇటీవ‌ల సంకేతాలు ఇచ్చారు. అందుకు ప్ర‌తిగా అఖిల‌ప్రియ యువ‌గ‌ళం సంద‌ర్భంగా సుబ్బారెడ్డి (AV subbareddy) మీద దాడికి దిగారు. న‌డిరోడ్డు మీద ఆమె త‌న అనుచ‌రుల‌తో రెచ్చిపోయారు. ప్ర‌తిగా సుబ్బారెడ్డి వ‌ర్గం కూడా ఘ‌ర్ష‌ణ‌కు దిగింది. ప‌ర‌స్ప‌రం ఇరు వ‌ర్గాలు కేసులు పెట్టుకోవ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ స్థానాల‌ను భూమా అడ్డాగా అఖిల‌ప్రియ

క‌ర్నూలు జిల్లాలోని నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ స్థానాల‌ను భూమా అడ్డాగా అఖిల‌ప్రియ (Akhilapriya)భావిస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ నుంచి అఖిల‌ప్రియ‌, నంద్యాల నుంచి ఆమె సోద‌రి మౌనిక లేదా ఆమె భ‌ర్త మంచు మ‌నోజ్ పోటీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఇంట్ర‌స్ట్ ఉంద‌ని ఇటీవ‌ల మ‌నోజ్ చెప్ప‌డం జ‌రిగింది. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి రాజ‌కీయాలు ప్ర‌ధాన మార్గంగా భావిస్తున్నారు. ఆ క్ర‌మంలో మాజీ మంత్రి అఖిల‌ప్రియ దూకుడుగా రాజ‌కీయాల‌ను చేస్తున్నారు. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ భూమా ముద్ర ప‌దిలంగా ఉంచాల‌ని భావిస్తున్నారు. అందుకే, మునుప‌టి మాదిరిగా నాగిరెడ్డి త‌ర‌హాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ ఏవీ సుబ్బారెడ్డి మీద రెచ్చిపోయారు. కానీ, చంద్ర‌బాబు(chandrababu) మాత్రం జ‌రిగిన ప‌రిణామాన్ని సీరియ‌స్ గా తీసుకున్నారు. బుధ‌వారం జ‌రిగిన టెలీక‌న్ఫ‌రెన్స్ లో వార్నింగ్ ఇచ్చారు.

Also Read : TDP Janasena: బీజేపీలేని కూటమి దిశగా టీడీపీ, జనసేన

యువ‌గ‌ళం నంద్యాల ఎంట్రీ సంద‌ర్భంగా మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణకు తాలూకూ కేసుల్లో మంత్రి భూమా అఖిల ప్రియ ఆమె భర్త భార్గవరామ్‌ను నంద్యాల పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసి అరెస్ట్ చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఘర్షణ జరిగింది. లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా స్వాగతం పలికేందుకు ఇరువర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించడంతో వాగ్వాదం నెల‌కొంది. ఈ ఘర్షణలో సుబ్బారెడ్డి ముక్కుకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర వాగ్వివాదాల తర్వాత వస్తువులు విసిరేయడంతో తీవ్రస్థాయికి చేరుకుంది. అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి, ఆ ప్రాంతంలో నిఘా పెంచినప్పటికీ, ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇలాంటి ప‌రిస్థితిని చంద్ర‌బాబు ఊహించ‌లేదు. వంద రోజులు పూర్తి చేసుకున్న యువ‌గ‌ళం సంద‌ర్భంగా ప్ర‌తి చోటా వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కానీ, సొంత పార్టీలోని గ్రూపులో రోడ్డున ప‌డ‌డాన్ని చంద్ర‌బాబు(chandrababu) సీరియ‌స్ గా తీసుకున్నారు. రాబోవు రోజుల్లో మ‌రోసారి ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంటే వేటు వేసేలా హెచ్చ‌రించారు.

Also Read : CBN Demand : క‌ర్ణాట‌క ఫ‌లితాల‌ఎఫెక్ట్ ! చంద్ర‌బాబు వ‌ద్ద‌కు బీజేపీ దూత‌లు.?