మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంట్లో గత మూడు రోజులుగా మహా చండీయాగం (Maha Chandi Yagam) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ యాగం పూర్తయింది. ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో ఎన్నికలు (Elections) జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని బాబు సన్నాహాలు చేస్తున్నారు..ప్రజల ప్రసన్నం తో పాటు దేవుడి అనుగ్రహం సైతం పొందేందుకు పూజలు చేయడం మొదలుపెట్టారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టయి, జైలు నుంచి విడుదలైన చంద్రబాబు…వరుసగా దేవాలయాలను సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామి, బెజవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న స్వామి వారిని దర్శించుకున్నారు. తాజాగా ఉండవల్లి నివాసం లో గత మూడు రోజులుగా మహాచండీయాగం నిర్వహిస్తూ వచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
శత చండీ పారాయణ ఏకోత్తర వృద్ధి మహా చండీయాగం, సుదర్శన హోమాలను నిర్వహించారు. మూడురోజుల నుండి జరిగిన ఈ క్రతువు ఈరోజుతో ముగిసింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు, నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ యాగం చివరి రోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వేదపండితుడు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రుత్విక్కులు మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహించారు.
Read Also : Sleeping Rules: దిండు కింద అలాంటివి పెట్టుకొని నిద్రపోతున్నారా.. అయితే జాగ్రత్త?