Anam Ramanarayana Reddy; నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ఆరుసార్లు మంత్రిగా ఆనం

ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు కొలువుదీరారు. అందులో ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రికార్డు నమోదు చేశారు.

Anam Ramanarayana Reddy; ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రులు కొలువుదీరారు. అందులో ఆనం రామనారాయణరెడ్డి కూడా ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రికార్డు నమోదు చేశారు. 1983 నుంచి ఉమ్మడి ఏపీలో నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ఆరుసార్లు మంత్రిగా పనిచేశారు.

1983లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి 1985లో నందమూరి తారక రామారావు క్యాబినెట్ లో రాపూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆర్ అండ్ బి మంత్రిగా పనిచేశారు.ఆ తర్వాత 1991, 1999, 2004, 2009లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రాపూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన తర్వాత సమాచార & ప్రజాసంబంధాల శాఖ((ఐ&పీఆర్) మంత్రిగా, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత 2014 వరకు కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఆనం రామనారాయణ అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగారు.

2014 ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీపై పోటీ చేసి ఓడిపోయిన ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రి పదవి దక్కించుకున్నారు.

Also Read: Rahul Gandhi: ప్రధాని మోదీపై విమర్శలు కురిపించిన రాహుల్ గాంధీ..!