Chandrababu Brand : ఏపీకి చంద్రబాబు ఒక బ్రాండ్. దాన్ని 2019 ఎన్నికల్లో ఆ రాష్ట్రం పోగొట్టుకుంది. కారణాలు ఏమైనా, ఆ రాష్ట్రం దుస్థితి తెలంగాణకు వరంగా మారింది. ప్రత్యేకించి హైదరాబాద్ భూములు బంగారు
కొండలుగా మారాయి. ఆ అంశమే మూడోసారి సీఎంను చేస్తుందని కేసీఆర్ మురిసిపోతున్నారు. మరోసారి ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ప్రతీష్టించడానికి ప్లాన్ చేస్తూ తెలంగాణ అభివృద్ధి పరుగులు పెట్టినట్టు చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది.
అమరావతి ప్రాజెక్టు కూలిపోవడమే తెలంగాణకు వరం (Chandrababu Brand)
అమరావతి ప్రాజెక్టు కూలిపోవడమే తెలంగాణకు కలిసొచ్చిందని మంత్రి హరీశ్, కేటీఆర్, కేసీఆర్ పలుమార్లు చెప్పారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ పలుమార్లు ప్రస్తావించారు. తెలంగాణ భూముల ధరలు పెరగడం తన విజయంగా కేసీఆర్ చెప్పుకుంటున్నారు. కానీ, ఆ విజయం వెనుక పెద్ద కుట్ర ఉంది. వాస్తవంగా ఆయన సాధించిన విజయం కాదు. ఎందుకంటే, 2014 నుంచి 2019 వరకు రెండు రాష్ట్రాలను అన్ని రంగాల్లోనూ పోల్చారు. ఎక్కడా ఏపీ తగ్గకుండా పోటీపడింది. రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ చంద్రబాబు పరిపాలన దక్షత అన్ని రంగాలను (Chandrababu Brand) ముందుకు తీసుకెళ్లింది. కరువు ప్రాంతంగా పేరున్న అనంతపురంలోనూ ఎకరం 40లక్షలు పలికేలా పారిశ్రామిక అభివృద్ధి కనిపించింది.
కేసీఆర్ అనారోగ్య పోటీకి తెరలేపారని అప్పట్లోనే చంద్రబాబు గ్రహించారు
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత తొలి ఐదేళ్లలో పోటీని గమనించిన కేసీఆర్ అనారోగ్య పోటీకి తెరలేపారని అప్పట్లోనే చంద్రబాబు గ్రహించారు. ఏపీ మీద కుట్ర జరుగుతుందని అక్కడి ప్రజలకు చెప్పారు. ఎన్నికల సమయంలో వంగివంగి తండం పెట్టి చెప్పారు. పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్ కుట్రపన్నుతున్నారని సామాన్యులకు అర్థమయ్యేలా ప్రతి వేదిక మీదా చంద్రబాబు (Chandrababu Brand)విడమరచి వివరించారు. కానీ, మాటకారి కేసీఆర్ చెప్పిన మాటలను ఏపీ ప్రజలు నమ్మారు. ప్రపంచంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్ అంటూ చంద్రబాబును మీడియా ముందు ఫోకస్ చేశారు. అవసరమైతే, ఏపీలోకి వచ్చి ప్రచారం చేస్తానని జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికారు. ఆయనకు మద్ధతు ఇచ్చారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సర్వశక్తులను జగన్మోహన్ రెడ్డికి అందించారు.
గోదాట్లో ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు హామీలను..
తెలంగాణ అభివృద్ధి కావాలంటే, ఏపీ ప్రగతి ఆగిపోవాలన్న ఏకైక కుట్రకు కేసీఆర్ 2019లోనే తెరలేపారని టీడీపీ (Chandrababu Brand) ఆనాడే చెప్పింది. కానీ, ఏపీ ప్రజలకు కేసీఆర్ మాటలు తియ్యగా అనిపించాయి. ఆయన మద్ధతు ఇస్తోన్న జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మారు. మాట తప్పడు, మడమ తిప్పడు అంటూ ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేశారు. నిజమేనంటూ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ లేనివిధంగా 151 మంది ఎమ్మెల్యేలను కట్టబెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా, మద్య నిషేధం, సీపీఎస్ రద్దు తదితర హామీలను సీఎం అయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గోదాట్లో కలిపేశారు. గోదావరి నీళ్లను కాళేశ్వరం రూపంలో తోడేయడానికి కేసీఆర్ కు సహకారం అందించారు. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ద్వారా కృష్ణా నీటిని తోడుకోవడానికి కేసీఆర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఫలితంగా రాయలసీమ, కోస్తా ఎడారిగా మారే ప్రమాదం సమీప భవిష్యత్ లో కనిపిస్తోందని నీటి రంగ నిపుణులు భావిస్తున్నారు.
Also Read : CBN Vision Effect : చంద్రబాబు విలువ తెలుస్తోంది.! ప్రపంచ వ్యాప్తంగా నిరసన!!
రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. సీఎం పదవి ఎక్కిన తరువాత అసలు స్వరూపం బయటపడింది. అమరావతి ప్రాజెక్టును కూల్చేశారు. ఫలితంగా 2029నాటికి సుమారు 25లక్షల కోట్ల సంపదను ఏపీ నష్టపోయిందని ఇటీవల ఎస్బీఐ సర్వే అంచనా వేసింది. అంతర్జాతీయ మేగజైన్లు అమరావతి ప్రాజెక్టును ప్రశసించడమే కాదు. ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధానిగా నిలుస్తుందని అంచనా వేస్తూ ఆర్టికల్స్ రాశాయి. కానీ, జగన్మోహన్ రెడ్డికి ఆ రాజధాని నచ్చడంలేదని, గిఫ్ట్ గా కేసీఆర్ కు అమరావతిని కూల్చేసి చూపించారు. ఫలితంగా హైదరాబాద్ గోల్డ్ మైన్ గా మారింది.
Also Read : CBN Arrest Effect : BRS పార్టీలో చీలిక?, `పోచారం` రియాక్షన్ తో అప్రమత్తం!
మూడోసారి సీఎం కావడానికి తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను చూపుతూ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాన్ని కూల్చడం ద్వారా తెలంగాణ ప్రగతిని చూపించడాన్ని ప్రత్యర్థి పార్టీలు కేసీఆర్ కుట్రను బయటపెడుతున్నాయి. అందుకే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చరిత్రను తవ్వి తీసి చూపించారు. కాకతీయుల సామ్రాజ్యాన్ని కూల్చడానికి పద్మనాయకులు చేసిన కుట్రను ఇటీవల వినిపించారు. కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన రెడ్డి రాజులను దూరం చేయడంలో పద్మనాయకుల పాత్రను ఇటీవల వివరించారు. ఇప్పుడు ఏపీ విషయంలోనూ ఆనాటి పద్మనాయకుల కుట్ర తరహాలోనే కేసీఆర్ అమలు చేశారని ప్రత్యర్థులు చేస్తోన్న ఆరోపణ.
మరో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పించడానికి భారీ కుట్ర (Chandrababu Brand)
మరో ఛాన్స్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పించడానికి భారీ కుట్రను కేసీఆర్ పన్నారని టీడీపీ అనుమానిస్తోంది. ఆ క్రమంలోనే చంద్రబాబును (Chandrababu Brand) జైలుకు పంపించడం ఒక ఎపిసోడ్ గా భావిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సహకారం కేసీఆర్ వేసిన ప్లాన్ ప్రకారం చంద్రబాబును జైలుకు పంపారని వినిపిస్తోంది. ఈసారి తెలుగుదేశం పార్టీని లేకుండా చేసే భారీ కుట్రకు తెరలేపారని సర్వత్రా జరుగుతోన్న చర్చ. అదే జరిగితే, ఇక ఏపీ పరిస్థితి ఏమిటి? చంద్రబాబులేని ఏపీని ఊహించుకుంటే కేసీఆర్ వేసిన భారీ కుట్ర ఏమిటో ఎవరికైనా అర్థమవుతోంది.