Chandrababu: పాపం బాబు ‘బ్యాడ్ లక్’

  • Written By:
  • Updated On - March 20, 2022 / 01:59 PM IST

త్రిదండి చిన జీయర్ వీడియోల వివాదంలోకి చంద్రబాబును అనాలోచితంగా వీరభిమానుల ముసుగులో ఉన్న కొందరు లాగారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఒక ప్రైవేట్ ఛానల్ లో జీయర్ పై నోరూపారేసుకు న్నాడు. అంతే కాదు , చంద్రబాబును సోషల్ మీడియాలో దోషిగా నిలిపాడు. ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నప్పుడు జీయర్ ఆశ్రమానికి ఆహ్వానించాడని దత్ చెప్పాడు. కానీ , బాబు నిరాకరించాడు అని వెల్లడించాడు. ఆ రోజు నుంచి జీయర్ అభిమానులు , దత్ మధ్య వార్ జరుగుతోంది.

ఇదే సమయంలో ఆశ్రమంలో జీయర్ కాళ్ళు మొక్కుతోన్న ఫోటోను ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేసాడు. దీంతో అశ్వనీదత్ చెప్పింది అబద్ధమని తేలింది. చంద్రబాబు కు తెలియకుండానే జీయర్ వివాదంలో దోషిగా నిలిచాడని అర్థం అవుతోంది. దానికి దత్, ఒక ప్రైవేట్ ఛానల్ కీలకంగా మారింది. చంద్రబాబు నాయుడుని ఎరక్కపోయి ఇరుకున పెట్టారు. చిన జీయర్ దగ్గరకు మనం వెళ్లడం ఏంటి? అని చంద్రబాబు అన్నారని అశ్వనీదత్ చెప్తే.. గతంలో చంద్రబాబు చిన జీయర్‌ని కలిసి కాళ్లు మొక్కిన ఫొటోలను వెలికితీశారు చిన జీయర్‌ మద్దతుదారులు. దీంతో చిన జీయర్‌పై కామెంట్స్ చేసిన అశ్వనీదత్‌తో పాటు చినజీయర్‌ని తిట్టించిన ఛానల్‌ని ఓ రేంజ్‌లో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

మేడారం జాతర ఇష్యూలో చిన జీయర్‌ని సమర్ధించే వారు కొందరైతే.. తిట్టిపోస్తున్నవాళ్లు అంతకు మించే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నిర్మాత అశ్వనీదత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిన జీయర్ పెద్ద వెధవ అని.. బ్యాక్ టిక్కెట్లు అమ్ముకున్న చరిత్ర ఉందని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఒక ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. ఈ ఇష్యూలోకి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని లాక్కొచ్చాడు. చిన జీయర్ చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావని.. కనపడిన చోట డబ్బులు పోగేస్తున్నాఢని దుమ్మెత్తి పోశాడు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చిన జీయర్ దగ్గరకు చంద్రబాబుని తీసుకెళ్లాడనికి చాలా ప్రయత్నాలు చేశారని.. అయితే చంద్రబాబు సమ్మతించలేదని దత్ చెప్పాడు. ప్రజలకు సేవ చేయాలి తప్పితే.. ఇట్లాంటి వాడి దగ్గరకు వెళ్లి మనం సేవ చేయడం ఏంటని బాబు అన్నాడని, అలాంటి వెధవ చినజీయర్ అంటూ అశ్వనీదత్ వివాదాస్పద కామెంట్స్ చేశాడు.

దీనిపై జీయర్ అభిమానులు టైం చూసుకొని వీడియో విడుదల చేసారు. ఫలితంగా చంద్రబాబు ను వీరాభిమానులు సోషల్ మీడియాలో బుక్ చేశారు. ఆ ఫోటో తో పాటు దత్, ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన ఛానెల్ ను నెటిజన్లు ఆడు కుంటున్నారు. పాపం చంద్రబాబు ఎప్పుడూ వీరభిమానులతో రాజకీయంగా భంగపడుతూనే ఉంటారు. ఇప్పుడిప్పుడే వీరాభిమానులను దూరంగా పెడ్తూ వాస్తవాలను లోకేష్ రూపంలో తెలుసుకుంటున్నారు. కానీ వీరాభిమానులు ముసుగులో సొంత ప్రాపకం కోసం బాబును వీలున్నంత డామేజ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ అయ్యారు.ఈ పరిణామాన్ని నిజమైన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా బాబు కు వీరాభిమానులు ముసుగులో చేస్తున్న డామేజ్ ను తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. పాపం చంద్రబాబు ఎవరో చేసిన అనాలోచిత నష్టానికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి రావటం బ్యాడ్ లుక్!,