Chandrababu : ఎన్నికల వేళ వరాలు కురిపిస్తున్న బాబు..

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 07:29 PM IST

ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీల నేతలు ఓటర్లకు వరాల జల్లు కురిపిస్తుంటారు. వృదులను , యువత ను టార్గెట్ గా చేసుకొని ఉచిత హామీలతో పాటు పలు కీలక వాగ్దాలను ప్రకటిస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు అనేక హామీలు తెలియజేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇక ఏపీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మరోసారి సీఎం పదవిలో కూర్చువాలని జగన్ (Jagan)..ఈసారి జగన్ ను గద్దె దించాలని బాబు (Chandrababu) & కో తీవ్రంగా శ్రమిస్తున్నారు. రేపటి నుండి టిడిపి అధినేత చంద్రబాబు , వైసీపీ అధినేత , సీఎం జగన్ లు తమ ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు.

ఇదిలా ఉంటె ఇప్పటీకే ప్రజాగళం (Prajagalam) పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తున్న బాబు..ప్రజలఫై వరాల జల్లు కురిపిస్తున్నారు. రెండు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాబు..తాము అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మెగా DSC (Mega DSC) నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కుప్పంలో యువతతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి బానిసలైన వారిని విముక్తి చేయడానికి మండలానికో సైకాలజిస్ట్ ను నియమిస్తామని చంద్రబాబు అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

‘రాష్ట్రంలో పెట్టుబడులు లేవు. ఉద్యోగాలు లేవు. యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్తున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్, DSC ఇస్తానన్న జగన్ ఏం చేశారు? మేం కియాకు 650 ఎకరాలు ఇచ్చి వేల ఉద్యోగాలు తెచ్చాం. 12 లక్షల కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు. మీ జీవితాలను చీకటిమయం చేసిన జలగన్నను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గంజాయి సాగుకు అధికారమైందని దుయ్యబట్టారు. ప్రతి కిరాణ దుకాణంలో గంజాయి దొరికే స్థాయికి దిగజారిందని పేర్కొన్నారు. లక్షల మంది యువత కలను నిర్వీర్యం చేస్తూ గ్రూప్-1 ఉద్యోగాలు అమ్ముకొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును అంధకారం చేసిన సర్వీస్ కమిషన్ ఉద్యోగులను శిక్షిస్తామని తెలిపారు.

ఏపీని కాాపాడుకునేందుకు పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. టీడీపీ, జనసేన , బీజేపీ అందుకే కలిశాయన్నారు. జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని నిషేధిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తన హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాలతో కొత్తదారి చూపించానని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అక్రమార్కుల చేతుల్లో పడితే చాలా ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరించారు. పారదర్శకంగా జరగాల్సిన పాలనలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.

Read Also :