రాష్ట్రంలో ఎన్నికలు పూర్తి అయ్యాయని అంత అనుకుంటున్న వేళ వరుసగా వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం అందర్నీ భయాందోళనకు గురి చేస్తుంది. టీడీపీ అభ్యర్ధులపైనే కాదు టీడీపీ కి ఓటు వేసిన కుటుంబాల ఫై కూడా దాడికి పాల్పడుతున్నారు. నిన్నటి నుండి వరుస దాడులతో పలు జిల్లాలు వణికిపోతున్నాయి. ఇలా వరుస దాడుల నేపథ్యంలో అదనపు బలగాలను పంపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీని కోరారు.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై డీజీపీతో చంద్రబాబు మాట్లాడారు. పోలింగ్ అనంతరం ప్రణాళికా బద్దంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి దాడులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. మాచర్లలో వందల మంది ప్రైవేటు సైన్యంతో జరుగుతున్న దాడులను అరికట్టడానికి అదనపు బలగాలను పంపాలని కోరారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని, దాడులకు పాల్పడతున్న వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనేక జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరుగుతున్న దాడులను ప్రస్తావించి లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫలితాలకు ఇంకా 20 రోజుల వరకు సమయం ఉండడం తో ఇంకెన్ని దాడులు చేస్తారో అని ఆందోళన వ్యక్తం చేసారు. ఇదంతా ఓటమి భయంతోనే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
Read Also : Fish Politics: మోడీ, మమతా బెనర్జీ మధ్య ఫిష్ పాలిటిక్స్