Site icon HashtagU Telugu

CM Chandrababu: బెస్ట్‌ సీఎంగా చంద్రబాబు.. అంతకంతకూ పెరుగుతున్న గ్రాఫ్‌!

Record In AP History

Record In AP History

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) ప్రజాదరణ దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు టాప్-3లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల విశ్వాసం ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తున్నాయి.

గత ఏడాది ఆగస్టులో ఇదే సర్వేలో ఐదో స్థానంలో ఉన్న చంద్రబాబు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి నాలుగో స్థానానికి ఎగబాకారు. ఇప్పుడు తాజా సర్వేలో మూడో స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో స్థానంలో ఉన్నారు.

కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుండటంతో సీఎం చంద్రబాబుపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతోంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా ఇప్పటికే ఐదు హామీలను అమలు చేశారు. ఇందులో పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ‘తల్లికి వందనం’ వంటి పథకాలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Womens Cricket: మహిళల క్రికెట్‌కు కొత్త ఉత్సాహం.. ఐసీసీ- గూగుల్ మ‌ధ్య కీల‌క ఒప్పందం!

సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడానికి కృషి చేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. స్వయంగా చంద్రబాబే కంపెనీలను ఏపీకి ఆహ్వానిస్తూ అమరావతికి పునర్వైభవం తీసుకువచ్చారు. అంతేకాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కూడా పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదిన్నర కాలంలో ఎలాంటి వివాదాలు లేకుండా పాలన సాఫీగా సాగుతోంది. దీంతో జాతీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు వచ్చింది. ఈ సానుకూల వాతావరణం, సమర్థవంతమైన పాలన కారణంగానే చంద్రబాబు ప్రజాదరణ గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతోందని ఇండియా టుడే సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

Exit mobile version