AP News: చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్, రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు రద్దు!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆర్టీసీ అలర్ట్ అయ్యింది. బస్సుల రక్షణ కోసం ముందుగానే బస్సు సర్వీసులను రద్దు చేసింది.

  • Written By:
  • Updated On - September 9, 2023 / 12:27 PM IST

AP News: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలువురు పార్టీ నేతలను గృహనిర్బంధం చేశారు. బుడ్డ రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానంద రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, తదితర పార్టీల ప్రముఖ నేతలను ముందస్తుగా నిర్బంధించారు.

శుక్రవారం రాత్రి కూడా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించించారని టీడీపీ ఆరోపించారు. అయితే శ్రీశైలంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు నాయుడు వెళ్లాలని భావించగా, స్థానిక నేతలు ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకోవడం పోలీసులకు సులువైంది. చంద్రబాబు అరెస్ట్ తో కర్నూలు, నంద్యాల టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నంద్యాల పట్టణం, బండి ఆత్మకూర్, ధోనే, కర్నూలు, ఆదోని, మంత్రాలయం తదితర ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించారు.

అయితే వాహనాలకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఆర్టీసీ రీజియన్‌లో మొత్తం 300 బస్సు సర్వీసులను నిలిపివేసింది. అయితే చంద్రబాబు అరెస్ట్ తో  టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తున్నారు. దీంతో ముందస్తుగా ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఆర్.వెంకట రాముడు మాట్లాడుతూ సర్వీసులను నిలిపివేసేందుకు డిప్యూటీ కమిషనర్‌ను కలిసి అనుమతి కోరామని తెలిపారు. అయితే బస్సులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Also Read: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరోసారి ఈడీ ముందుకు కవిత!