Site icon HashtagU Telugu

CM Jagan Video: కొట్టాడు తీసుకున్నాం.. మా టైమ్ వస్తుంది.. జగన్ వీడియో మరోసారి వైరల్..!

CM Jagan Video

jagan emotional speech in amalapuram

CM Jagan Video: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నంద్యాలలో సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దింతో టీడీపీతో పాటు ఇతర పార్టీ నాయకులు చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు కూడా కౌంటర్స్ ఇస్తున్నారు. సీఎం జగన్ పాత వీడియో (CM Jagan Video)ను వైసీపీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. గతంలో నంద్యాలలో వైసీపీని ఓడించి బాబు దెబ్బకొట్టగా.. ఇప్పుడు అక్కడే బాబును అరెస్ట్ చేయించి జగన్ దెబ్బకొట్టారని కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో ఆ ఫలితం తర్వాత ‘గుండెధైర్యం ఉండాలి. ఆయన కొట్టాడు తీసుకున్నాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం’ అని జగన్ అన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Ganta Srinivasa Rao : జగన్ కళ్ళలో ఆనందం చూడటానికే చంద్రబాబును అరెస్టు చేశారు : గంటా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో శనివారం ఉదయం చంద్రబాబుని సీఐడీ అరెస్ట్ చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన పేరు ఎక్కడుందో చెప్పాలని చంద్రబాబు పోలీసులను అడిగారు. ‘‘మా వద్ద ఆధారాలు ఉన్నాయి. హైకోర్టుకు ఇచ్చాం. రిమాండ్ రిపోర్టులో అన్ని విషయాలు ఉన్నాయి. విజయవాడ తీసుకెళ్లేలోపు రిమాండ్ రిపోర్ట్ ఇస్తాం’’ అని పోలీస్ అధికారులు సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు సీఎంగా 2015లో స్కిల్ డెలవప్మెంట్ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం జరిగింది. రూ.3,356 కోట్ల ఈ ప్రాజెక్టు వ్యయంలో రూ.371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు రాగా.. 2020 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 FEBలో ACB విచారించగా.. డిసెంబర్ లో కేసు CIDకి బదిలీ అయ్యింది. A1గా చంద్రబాబు, A2గా అచ్చెన్నాయుడు ఉన్నట్లు CID పేర్కొంది.