టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు వరుస కేసుల విచారణ టెన్షన్ పెట్టిస్తున్నాయి. నిన్న మంగళవారం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీజేఐకి అప్పగించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఏపీ ఫైబర్ నెట్ కేసు (AP Fibernet Scam)లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా.. బెయిల్‌ను నిరారించిన విషయం తెలిసిందే. దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంలో వేసిన ఫిటీషన్ పై నేడు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలాఎం త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. మరి సుప్రీం కోర్ట్ ఏ తీర్పు ఇస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటె..ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతుండడం తో చంద్రబాబు..వరుస పర్యటనలు , సభలు , సమావేశాలతో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే పలు సభల్లో పాల్గొని టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న బాబు..జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతున్నారు. మరోపక్క వైసీపీ నుండి కూడా పెద్ద ఎత్తున నేతలు..టీడీపీ లోకి చేరుతున్నారు. దీంతో పార్టీ ఫై ప్రజల్లో నమ్మకం మరింత పెరుగుతుంది. మరి ఈ కేసుల నుండి బాబు బయటపడతారో..లేదో..ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో..అనేది టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ గా మారింది.
Read Also : OYO CEO Ritesh Agarwal: ఓయో సీఈవో రితేష్ అగర్వాల్‌కు రామ మందిర ఆహ్వాన పత్రిక..!