Site icon HashtagU Telugu

Chandrababu : అరకు ‘రా కదలిరా’ సభలో కీలక హామీ ప్రకటించిన చంద్రబాబు

Babu Araku

Babu Araku

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సభలతో ప్రజలను కలుస్తున్నారు. ‘రా కదలిరా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభలు నిర్వహిస్తూ..కీలక హామీలను కురిపిస్తూ ప్రజల్లో నమ్మకం కలిగిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సీఎం అయినా బాబు..ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. జగన్ పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచుకొని అధికారం చేపట్టాడు.

ఇక ఇప్పుడు మరోసారి విజయం సాధించాలని జగన్ చూస్తుంటే..ఆ ఛాన్స్ జగన్ కు ఇస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని టీడీపీ ఆరోపిస్తూ మళ్లీ రాష్ట్రం బాగుపడాలంటే..నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే..ధరలు తగ్గాలంటే టీడీపీ పార్టీనే రావాలిఅని ప్రజలకు బాబు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ‘రా కదలిరా’ పేరుతో సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు అరకు లో సభ నిర్వహించిన బాబు..పోలవరం నిర్వాసితులకు కీలక హామీ ప్రకటించారు.

టీడీపీ ప్రభుత్వం ఏర్పడగానే పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాంతం ఏలూరు జిల్లా పరిధిలో ఉండగా, మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోంది. అందుకే గిరిజనులు కొంత కాలంగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ను తీరుస్తామని చంద్రబాబు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా జీవో నెంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వం వైసీపీదని..గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించా జగన్ అడ్డుపడ్డారన్నారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్‌కు ఇష్టం లేదున్నారు. అందుకే ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం రద్దు చేశారు. ప్రపంచంలో ఎక్కడ చదివినా గిరిజనులకు స్కాలర్‌షిప్పులు ఇస్తే.. దాన్నీ తీసేశారు. నైపుణ్యం కోసం శిక్షణ కేంద్రాలు పెడితే వాటినీ ఊడగొట్టారు. గిరిపుత్రిక కల్యాణ పథకాన్నీ రద్దు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో రా కదిలిరా బహిరంగ సభలోను జగన్ ఫై చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో ఆనందానికి అడ్రస్ లేకుండా పోయిందని చంద్రబాబు వాపోయారు. దగాపడ్డ ఆంధ్ర ప్రజల కోసం రాష్ట్రమంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ‘అధికారంలోకి రాగానే రౌడీయిజానికి బ్రేకులు వేస్తాను. విద్యుత్ బిల్లులు జోన్ సిస్టమ్ తో దోచేస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.1.50కే కరెంట్ ఇస్తాము. సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు పెడతాం. నాసిరకం మద్యంతో 30వేల మంది చనిపోయారు. కేవలం ఒక వ్యక్తి ధన దాహమే ఇందుకు కారణం. బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి రక్షణ చట్టం తెస్తా. సమాజహితం కోసం ఉపయోగించాల్సిన ఇసుక సంపదను దోచేస్తున్నారు. కార్పొరేషన్లు పెట్టినా పైసా విదల్చని ప్రభుత్వం ఇది. ఈ ఊరిలో చెత్త పక్క ఊరిలో బంగారం అవుతుందా?’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ట్రాన్సఫర్స్ పై చంద్రబాబు మండిపడ్డారు.

Read Also : Sreeleela : శ్రీలీల కు ఇక గడ్డుకాలమేనా..?

Exit mobile version