Chandrababu Angallu Case : చంద్రబాబు అంగళ్లు అల్లర్ల కేసు విచారణ వాయిదా

అంగళ్లులో ర్యాలీ నిర్వహణ కోసం పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నామని చంద్రబాబు తన పిటిషన్‌లో తెలిపారు. ర్యాలీ అంగళ్లు కూడలికి చేరుకోగానే అధికారపార్టీకి చెందినవారు

  • Written By:
  • Updated On - September 22, 2023 / 12:52 PM IST

చంద్రబాబు అంగళ్లు అల్లర్ల కేసు (Chandrababu Angallu Case) విచారణను వాయిదా వేసింది కోర్ట్ (High Court). చంద్రబాబు (Chandrababu) యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. అంగళ్లు (Angallu )లో ర్యాలీ నిర్వహణ కోసం పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నామని చంద్రబాబు తన పిటిషన్‌లో తెలిపారు. ర్యాలీ అంగళ్లు కూడలికి చేరుకోగానే అధికారపార్టీకి చెందినవారు తన కాన్వాయ్‌పై రాళ్లు వేశారని.. తమపైనే దాడి చేసి తిరిగి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని వెల్లడించారు. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టు లో విచారణ జరిగింది. తుది విచారణ ఈ నెల 26 కి వాయిదా వేసింది.

Read Also : Youth Suicide : పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం తల్లిదండ్రులు వారితో గడపకపోవడమేనా..?

ఇదిలా ఉంటె చంద్రబాబు అరెస్ట్ ఫై ఏపీ అసెంబ్లీ టీడీపీ నేతల నిరసనలతో హోరెత్తిపోతుంది. నిన్న , ఈరోజు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. అధికార పక్షం తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపటి నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ.. గత రెండు రోజులుగా శాసనసభలో ఆందోళన చేపడుతూ వస్తున్నారు. ఈ విషయంలో చర్చ జరపాలంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో పోడియం వద్ద నిరసన తెలిపారు. అయితే నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడం…వాయిదా తీర్మానాలకు ఆమోదం తెలుపకవడం..ఇవన్ని పరిణామాల నేపథ్యంలో సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది.