Site icon HashtagU Telugu

Rain Effect : పల్నాడు లో చంద్రబాబు, పవన్ పర్యటన రద్దు

Pawan Babu Palnadu

Pawan Babu Palnadu

పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దైంది. వనం-మనం (Vana Mahotsavam) పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నేడు పల్నాడు (D)లో సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటించాల్సి ఉంది. కాకాని పంచాయతీ పరిధిలోని JNTUలో మొక్కలు నాటాలని అనుకున్నారు. కానీ జిల్లాలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తుండడం తో సభా ప్రాంగణం బురదమయం అయ్యింది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు పర్యటనను రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం కాకాని JNTU కాలేజీలో జరిగే కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకావాల్సి ఉంది. అటు మరోచోట కార్యక్రమం నిర్వహణకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రభుత్వం ‘మనం వనం’ కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 10 లక్షలు మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగా జేఎన్టీయూ వద్ద ఆరు వేలు, పల్నాడు జిల్లా వ్యాప్తంగా నేడు 3.5 లక్షల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అందులో రావి, వేప, నాగమల్లి మొక్కలను నాటనున్నారు. కాగా అన్య జాతుల మొక్కలు పెంచడం మానేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘కోనో కార్పస్ మొక్కలను పెంచకండి. వాటి దుష్ప్రభావాలను అర్థం చేసుకుని అరబ్ దేశాలే పెంచడం లేదు. ఈ మొక్కలను పశువులు తినవు. పక్షులు గూడు పెట్టుకోవు. క్రిమికీటకాలు రావు. వీటి వల్ల భూగర్భ జలసంపద ఎక్కువ వినియోగం అవుతుంది. శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి’ అని పవన్ వెల్లడించారు.

Read Also : YSRCP : బీదమస్తాన్‌ వైదొలగడంతో నెల్లూరు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి గట్టి ఎదురుదెబ్బ..!