NTR : తెలుగు జాతీకి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్‌: చంద్రబాబు

  • Written By:
  • Publish Date - May 28, 2024 / 10:54 AM IST

NTR 101 JAYANTHI: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌)(Nandamuri Tarakara Rao) 101వ జయంతి(Jayanthi) ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని కొనియాడారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. టీడీపీ స్థాపనతో దేశంలోనే తొలిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని గుర్తుచేశారు.

Read Also: IND vs PAK Match: టీ20 ప్ర‌పంచ క‌ప్‌.. భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు..?

సంక్షేమం, అభివృద్ధితోపాటు పాలనా సంస్కరణలకు బాటలు వేశారని చంద్రబాబు కొనియాడారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని చాటి చెప్పారని అన్నారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు.

Read Also: Mukesh Ambani Plan: ముఖేష్ అంబానీ న‌యా ప్లాన్‌.. ఆఫ్రికాలో అడుగుపెట్టేందుకు సిద్ధం..!

మరోవైపు తాతయ్య నందమూరి తారకరామారావుగారే తనకు నిత్యస్ఫూర్తి అని టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులు(Tributes) అర్పించిన లోకేశ్.. తెలుగుజాతి ఆత్మగౌరవం, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి విశేష కృషిచేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.